తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుడు.. మంత్రి కేటీఆర్ మహా దూకుడు మీదున్నారు. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ తర్వాత.. తానే ఆయనకు అసలుసిసలు వారసుడినన్న విషయాన్ని తేల్చే ప్రయత్నాల్ని మరింత ముమ్మరం చేస్తున్న సంగతి తెలిసేందే. విదేశీ కంపెనీలతో తరచూ భేటీ కావటం.. తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావటానికి బాబు మాదిరి అడుగులు వేస్తున్న కేటీఆర్.. ఐటీ మీదనే ఫోకస్ అంతా పెట్టకుండా.. నాన్ ఐటీ రంగాల మీద కూడా దృష్టి నిలపటం కనిపిస్తోంది.
తన మంత్రిత్వ శాఖ అయితే.. చేనేత మీద ఫోకస్ చేసిన ఆయన.. తెలంగాణ చేనేతకు చేయూత అందించాలన్న సంకల్పాన్ని ఆయన ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే వారానికి ఒక రోజు చేనేత వస్త్రాల్ని ధరించాలని ప్రచారం చేయటమే కాదు.. చేనేత వస్త్రాల్ని ప్రమోట్ చేసేందుకు సినీ నటి సమంతను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించటమే కాదు.. చేనేత ఇష్యూను ఒక కొలిక్కి తీసుకొచ్చేందుకు ఆయన తెగ శ్రమిస్తున్నారు.
తాజాగా.. కాటన్ వస్త్రాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటూ.. విదేశాలకు భారీ ఎత్తున వస్త్రాల్ని ఎగుమతి చేసే తిరుపూరును తాజాగా సందర్శించారు. తమిళనాడులోని తిరుపూరు కాటన్ వస్త్రాలకు ఫేమస్. ఇక్కడ కాటన్ ఉత్పత్తుల్ని తయారు చేసే పరిశ్రమలు..కార్మికులు పెద్ద ఎత్తున ఉన్నారు. ఈ రంగానికి చెందిన ప్రముఖుల్ని కలిసిన కేటీఆర్.. దేశంలోనే అతి పెద్దదైన జౌళి పార్కును తమ రాష్ట్రంలోని వరంగల్ లో ఏర్పాటు చేసే పనులు మొదలెట్టామని.. తమ వద్ద పెట్టుబడులు పెట్టాలని కోరారు.
తిరుపూరు పారిశ్రామికవేత్తలకు వరంగల్ జౌళి పార్కులో స్థలాల్ని కేటాయించటంతో పాటు.. ఒక్కొక్కరికి 50వేల అడుగుల స్థలాన్ని ఇవ్వటంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. అదే సమయంలో తిరువూరు కాలుష్య నియంత్రణ విధానాల్ని తాము అమలు చేస్తామని చెప్పారు.తిరువూరు ప్రతినిధులకు వరంగల్ జౌళి పార్కులు ప్రల్యేకంగా బ్లాక్ కేటాయిస్తామన్న కేటీఆర్ మాటలకు అక్కడి పారిశ్రామికవేత్తల రియాక్ట్ అయి పది మంది అప్పటికప్పుడు ఫ్యాక్టరీలు స్టార్ట్ చేసేందుకు ముందుకు రావటం గమనార్హం. ఇదంతా బాగానే ఉంది కానీ.. తిరువూరు ఎపిసోడ్ నుంచి మరింత లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని కేటీఆర్ కు పలువురు సూచిస్తున్నారు.
పల్లెటూరు స్థాయి నుంచి రూ.35వేల కోట్ల వార్షిక ఆదాయానికి చేరుకున్న తిరుపూరు విజయం వెనుక భారీ కాలుష్య మరకలు ఉన్న విషయాన్ని మర్చిపోకూడదు. కోర్టు ఆదేశాలతో ఫ్యాక్టరీల్ని మూసేసినా.. నేటికీ కాలుష్య కోరల్లో నుంచి తిరుపూరు బయటపడలేదన్న నగ్నసత్యాన్ని మర్చిపోకూడదు. తిరుపూరుకు మించి వరంగల్ జౌళి పార్క్ డెవలప్ కావాలని కోరుకోవటంలో తప్పు లేదు. కానీ.. మంచి కంటే చెడును మాత్రమే తొందరగా అలవాటు చేసుకునే మైండ్ సెట్ ఎక్కువగా ఉన్న వారితో లాభం కంటే నష్టమే ఎక్కువగా చోటు చేసుకునే ప్రమాదం ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఈ విషయంలో ఏ మాత్రం తేడా జరిగినా.. తిరుపూరు మాదిర అభివృద్ధి తర్వాత.. అక్కడి కాలుష్యం తెలంగాణకు గుండెకోతను మిగిల్చే ప్రమాదం ఉంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/