న్యూజిలాండ్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ప్రియాంక రాధాకృష్ణన్ కు తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. న్యూజిలాండ్ లో మంత్రి స్థాయికి ఎదిగిన మొట్టమొదటి భారతీయురాలు ప్రియాంక కావడం గర్వించదగ్గ విషయం అని అయన తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించిన న్యూజిలాండ్ ప్రధాని జసిందా అర్డెర్న్ కు కూడా కేటీఆర్ అభినందనలు తెలిపారు. న్యూజిలాండ్ ప్రధాన మంత్రిగా జసిందా అర్డెర్న్ రెండోసారి ఎన్నికయ్యారు. 83.7% కంటే ఎక్కువ ఓట్లు లెక్కించగా, ఆర్డెర్న్ యొక్క లేబర్ పార్టీ 49శాతం ఓట్లను గెలుచుకున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.
కరోనాని నియంత్రణకి గాను ఆమె చేసిన కృషినే ఈ విజయానికి కారణమని ఆ పార్టీ నేతలు వెల్లడించారు. ఇక ఈ ఎన్నికల్లో లేబర్ పార్టీకి 49శాతం ఓట్లు రాగా.. నేషనల్ పార్టీకి 27శాతం ఓట్లు వచ్చినట్టుగా ఎన్నికల కమిషన్ వెల్లడించింది.ఇక 2017లో జసిండా ఆర్డెర్న్ తొలిసారి ప్రధానిగా ఎన్నికైయ్యారు. న్యూజిలాండ్ ప్రధాన మంత్రి జసిందా ఆర్డెర్న్ సోమవారం కొత్త మంత్రివర్గాన్ని ఆవిష్కరించారు. జెసిండా ఆర్డెర్న్ కేబినెట్ లో మంత్రిగా ప్రియాంక రాధాకృష్ణన్ బాధ్యతలను చేప్పట్టబోతోంది.
ప్రియాంక రాధాకృష్ణన్ స్వస్థలం కేరళలోని ఎర్నాకుళం జిల్లా పరవూర్. రామన్ రాధాకృష్ణన్, ఉషా దంపతులకు ఆమె జన్మించారు. అనంతరం ఆ కుటుంబం చెన్నైలో స్థిరపడింది. ప్రియాంకా విద్యాభ్యాసం సింగపూర్, న్యూజిలాండ్ లో కొనసాగింది. ఆ తర్వాత ఆమె... క్రైస్ట్ చర్చ్ కు చెందిన రిచర్డ్ సన్ ను పెళ్లి చేసుకుంది. 2004 నుండి లేబర్ పార్టీలో చురుకైన పాత్రను పోషించారు. 2017లో తొలిసారిగా న్యూజిలాండ్ పార్లమెంటులో ప్రవేశించిన ప్రియాంక, వారసత్వ శాఖకు పార్లమెంటరీ ప్రైవేట్ కార్యదర్శిగా పనిచేశారు.