టీఆర్ఎస్ డిఫెన్స్ లో పడింది. ఒక్కరోజులో చోటుచేసుకున్న నాటకీయ పరిణామాలతో ఎటూ తేల్చుకోలేకుండా పోతోంది. హుజూరాబాద్ టీఆర్ఎస్ టికెట్ పై మౌనం దాల్చింది. ఒకే రోజు ఇటు సీనియర్ ఎల్.రమణ చేరడం.. అటు కౌశిక్ రెడ్డి సైతం కాంగ్రెస్ కు రాజీనామా చేసి గులాబీ గూటికి వస్తానని ప్రకటించడంతో ఇప్పుడు టీఆర్ఎస్ టికెట్ ఎవరికి అనేది అంతుచిక్కకుండా ఉంది.
రెండు నెలలుగా పక్క ప్లానింగ్ తో ఉన్న టీఆర్ఎస్ శ్రేణులకు ‘కౌశిక్ రెడ్డి’ ఆడియో లీక్ లతో బుక్కవ్వడం.. జనాల్లో అభాసుపాలు కావడంతో ఎటూ తోచడం లేదు. ఆడియో లీక్ తో మైనస్ అయిన కౌశిక్ రెడ్డికి టికెట్ ఇస్తే నెగ్గుతాడా? లేదా అన్నది డౌట్ గా మారింది.
కౌశిక్ మాటల్లో ‘తనకు టిఆర్ఎస్ టికెట్ ఖాయమైందని.. యువతకు, నాయకులకు ఒక్కొక్కరికి రూ.3వేల నుంచి రూ.5వేల వరకు ఇవ్వాలని చెప్పడంతో దుమారం రేగింది. డబ్బులతో కాంగ్రెస్ కార్యకర్తలను కొనుగోలు చేసుకొని కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లోకి వెళుతున్నారనే ప్రచారం సోషల్ మీడియా వేదికగా సాగుతోంది.
నిజానికి టీఆర్ఎస్ వ్యూహం ఏమిటంటే అభ్యర్ధి విషయాన్ని ప్రకటించకుండా చివరి నిముషం వరకు గుంభనంగా ఉంచాలని. నామినేషన్ తేదీ దగ్గరకు వచ్చినపుడు కౌశిక్ ను ప్రకటించటానికి డిసైడ్ అయ్యిందట. ఆపని చేస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీని కోలుకోనీయకుండా దెబ్బ తీయచ్చని వ్యూహం పన్నారట. అయితే కౌశిక అత్యుత్సాహంతో తమ వ్యూహం కాస్త బయటపడిపోయింది. అందుకనే కౌశిక్ ను బహిష్కరించి ఆయన స్ధానంలో మరో నేతను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
కాంగ్రెస్ నుండి కౌశిక్ బహిష్కరణకు గురయ్యాడు కాబట్టి తర్వాత ఏమిటి ? అనేది అర్ధం కావటంలేదు. ఇపుడు కౌశిక్ టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుని టికెట్ ఇచ్చేది డౌటేనట. ఒకవేళ టీఆర్ఎస్ గనుక కౌశిక్ ను పోటీ చేయిస్తే ఆయన మాట్లాడిన ఆడియోను కాంగ్రెస్ అస్త్రంగా ఉపయోగించుకోవాలని ప్లాన్ చేస్తోంది. ఇదే సమయమంలో బీజేపీ కూడా కేసీయార్ ను టార్గెట్ చేయటం ఖాయం. కాంగ్రెస్+బీజేపీ టార్గెట్ ను తప్పించుకోవాలంటే కౌశిక్ ప్లేసులో కొత్త అభ్యర్ధిని పెట్టే అవకాశం ఉందంటున్నారు. ఈ పరిణామంతో గులాబీ నేతల్లో అంతర్మథనం మొదలైనట్లు సమాచారం.
ఇక కౌశిక్ రెడ్డి సైతం టీఆర్ఎస్ లో చేరికపై టికెట్ ఇస్తేనే చేరాలని డిసైడ్ అయ్యారట.. ఈనెల 16న దీనిపై కార్యకర్తలతో సమీక్ష నిర్వహించి డిసైడ్ చేస్తానని తెలిపారు.
ఇక ఉప ఎన్నిక కోసం కేసీఆర్ చేయించిన సర్వేలోనూ.. ఇంటెలిజెన్స్, వ్యక్తిగత సర్వేల్లో సైతం ఈటలకు బలమైన పోటీదారు కౌశిక్ రెడ్డినేనని తేలిందని సమాచారం. ఈ మేరకు కేసీఆర్ కూడా ఈ డ్యామేజ్ తర్వాత దీనిపై పునరాలోచపడిపోయాడట.. దీంతో ఇప్పుడు హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనే పీటముడి తెగడం లేదట.. ఏం జరుగుతుందనేది ఉత్కంఠగా మారింది.
టీఆర్ఎస్ టికెట్ ఖాయమైపోయిన తర్వాత కౌశిక్ రెడ్డి నోరుజారి అనవసరంగా చిక్కుల్లో పడిపోయాడనే చర్చ సాగుతోంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో కౌశిక్ రెడ్డి వ్యవహారం చివరకు ఎటూ కాకుండా పోతుందేమో అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. టీఆర్ఎస్ తో డీల్ మేరకు ఉపఎన్నికలో నామినేషన్ వేసేముందు వరకు చాలా గుంభనంగా ఉంచాల్సిన సీక్రెట్ ను కౌశిక్ తన అత్యుత్సాహంతో రివీల్ చేసేశారు. దాంతో టీఆర్ఎస్ ను ఇబ్బందుల్లోకి నెట్టేయటంతో పాటు అందరి ముందు పలుచనైపోయారు.ఇప్పుడు టీఆర్ఎస్ కౌశిక్ రెడ్డికి టికెట్ ఇస్తుందా? లేదా? అన్నది సందేహంగా మారింది.