ఏపీ ప్రభుత్వానికి షాకుల మీద షాకులు ఇస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం.. శుక్రవారం రాత్రి అనూహ్య నిర్ణయాన్ని తీసుకోవటం తెలిసిందే. గతంలో తాము జారీ చేసిన ఆదేశాల్ని పక్కన పెట్టి.. రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్న విధంగా జీవో జారీ చేసిన దానికి ఆయన భారీ మూల్యం చెల్లించుకోవాల్సి రావటం తెలిసిందే. సీఎస్ తీరుతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఈసీ.. ఊహించని రీతిలో ఆయన స్థానంలో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఆయన్ను శనివారం ఉదయం బాధ్యతలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఈసీ నిర్ణయంతో ఆయనీ రోజున ఏపీ సీఎస్ బాధ్యతల్ని స్వీకరించారు. దీనికి ముందు ఆయన.. విజయవాడ కనక దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. సతీసమేతంగా అమ్మవారి ఆశీస్సులు తీసుకున్న ఆయన.. ఆలయ పండితుల వేదాశీర్వచనం తీసుకున్న ఎల్వీ దంపతులకు.. అక్కడి పురోహితులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అనంతరం ఆయన.. తన కార్యాలయంలో సీఎస్ బాధ్యతల్ని చేపట్టారు.