కూకట్ పల్లిలో మిస్ అయిన ఆమె చిత్తూరు జిల్లాలో కనిపించింది.. ట్విస్ట్ ఏమంటే?

Update: 2019-12-20 10:52 GMT
అన్ని మిస్సింగ్ కేసులు ఒకేలా ఉండవన్న దానికి నిదర్శనంగా తాజా ఉదంతాన్ని ఉదాహరణగా చెప్పాలి. మిస్సింగ్ కేసుల గురించి పోలీసులు అనుచితంగా మాట్లాడతారని తిట్టిపోస్తాం కానీ.. ఇప్పుడు చెప్పే ఉదంతం గురించి తెలిసినప్పుడు నిజమే పోలీసుల మాటలు పూర్తిగా తప్పని కూడా చెప్పలేని పరిస్థితి.

ఇంతకూ విషయం ఏమంటే.. హైదరాబాద్ లోని కూకట్ పల్లికి చెందిన మంజుల అనే మహిళ మిస్ అయ్యింది. తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆమె కొద్ది రోజుల క్రితం మిస్ అయ్యారు. ఆమె భర్త.. పేరెంట్స్ ఇచ్చిన ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు షాక్ తిన్న పరిస్థితి.

ఎందుకంటే కూకట్ పల్లిలో మిస్ అయిన పాతికేళ్ల మంజుల చిత్తూరు జిల్లా కురబలకోట మండలంలోని అంగళ్లలో దొరికారు. ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తే విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి. పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్న పాతికేళ్ల మంజుల బేల్దారి పనులకు వెళ్లేది. అక్కడే ఆమెకు 35 ఏళ్ల రవితో పరిచయమైంది. వారిద్దరి మధ్య బంధం బలపడి చివరకు వివాహేతర సంబంధానికి దారి తీసింది. రవికి కూడా పెళ్లయి పిల్లలు ఉన్నారు.

అయినప్పటికీ తామిద్దరికి ఇష్టమైన వేళ.. అందరికి దూరంగా వెళ్లిపోవాలని నిర్ణయించుకొని.. ఒక రోజు తన ఇద్దరు పిల్లలతో కలిసి మంజుల రవితో వెళ్లిపోయింది. అనుమానం వచ్చిన పోలీసులు మేస్తి అయిన రవి ఫోన్ కాల్ డేటాను తనిఖీ చేయగా అసలు విషయం అర్థమై అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి ఉదంతాలు తరచూ ఎదురవుతున్న వేళ.. పోలీసులు కొన్నిసార్లు నెగిటివ్ గా ఆలోచించటాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News