లాజిక్ మిస్ అయ్యిందిగా ల‌గ‌డ‌పాటి!

Update: 2019-05-19 05:12 GMT
నిబంధ‌న‌ల ప్ర‌కారం చూస్తే.. సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఏడు ద‌శ‌ల పోలింగ్ ముగిసే వ‌ర‌కూ ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ ను వెల్ల‌డించ‌కూడ‌దు. కానీ.. మీడియా మీట్ పేరుతో శ‌నివారం సాయంత్రం మీడియా ముందుకు వ‌చ్చిన ఆయ‌న‌.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవ‌రు గెలుస్తార‌న్న విష‌యాన్ని చెప్పుకొచ్చారు. అలా అని నేరుగా చెప్ప‌కుండా.. పోలిక ద్వారా ప‌రోక్షంగా విజేత‌లు ఎవ‌ర‌న్న విష‌యాన్ని చెప్పే ప్ర‌య‌త్నం చేశారు.

ల‌గ‌డ‌పాటి చెప్పిన మాట‌ల సారాంశాన్ని ఒక చిన్న పోలిక‌తో చెప్పేశారు. వినేందుకు బాగున్న‌ప్ప‌టికీ.. వాస్త‌వంలో అస‌లు లాజిక్ మిస్ అయ్యార‌న్న అభిప్రాయం క‌లుగ‌క మాన‌దు. ధ‌నిక రాష్ట్రమైన తెలంగాణలో ప్ర‌జ‌లు కారును అక్కున చేర్చుకున్నార‌ని.. విభ‌జ‌న కార‌ణంగా పేద రాష్ట్ర‌మైన ఏపీ ప్ర‌జ‌లు సైకిల్ ను త‌మ అక్కున చేర్చుకున్న‌ట్లుగా చెప్పారు. ల‌గ‌డ‌పాటి పోలిక‌ను మామూలు మాట‌ల్లో చెప్పాలంటే తెలంగాణ‌లో టీఆర్ఎస్.. ఏపీలో టీడీపీ గెల‌వ‌నున్న‌ట్లు అంచ‌నా వేశారు.

మ‌రి.. ల‌గ‌డ‌పాటివారి అంచ‌నాలో నిజ‌మెంత‌? అన్న‌ది చూస్తే.. వినేందుకు ఆయ‌న మాట‌లు బాగున్నా.. లాజిక్ లో మాత్రం తేలిపోయార‌ని చెప్పాలి. పేద రాష్ట్రమైన ఏపీలో ప్ర‌జ‌లు సైకిల్ ను సొంతం చేసుకోవ‌టానికి ముందు నిత్య‌వ‌స‌ర‌మైన ఫ్యాన్ ను సొంతం చేసుకుంటారు క‌దా?   సైకిల్  కంటే ఫ్యాన్ అవ‌స‌రం అంద‌రికి క‌దా?  ఆ మాట‌కు వ‌స్తే ఇంటికో సైకిల్ కూడా ఉండ‌దు. కానీ.. ప్ర‌తి ఇంట్లో రెండుమూడు ఫ్యాన్లు త‌ప్ప‌నిస‌రి. మ‌రి.. పేద ప్ర‌జ‌లు నిలిచేది ఫ్యాన్ ప‌క్షాన క‌దా?  అంచ‌నాల సంగ‌తి త‌ర్వాత‌.. పోలిక కూడా ఇంత పేల‌వంగా చెబితే ఎలా ఆంధ్రా ఆక్టోప‌స్ అన్న అభిప్రాయాన్ని ప‌లువురు వ్య‌క్తం చేశారు.
Tags:    

Similar News