ఢిల్లీలో అతి పెద్ద వైరస్ చికిత్స కేంద్రం... 22ఫుట్ బాల్ స్టేడియాలంతా పెద్దది ! !

Update: 2020-06-17 08:50 GMT
దక్షిణ ఢిల్లీలోని రాధా సోమి ఆధ్యాత్మిక కేంద్రం 10 వేల పడకలతో ప్రపంచంలోనే అతిపెద్ద తాత్కాలిక వైరస్ కేర్ ఫెసిలిటీగా మారనుంది. దీని విస్తీర్ణయం దాదాపు 22 ఫుట్ బాల్ మైదానాలంత ఉంటుంది. ఈ కేంద్రాన్ని తాత్కాలిక వైరస్  కేంద్రంగా మార్చే పనులకు ఢిల్లీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ ఫెసిలిటీలో కొర్రుగేటెడ్ కార్డుబోర్డు పడకలు ఏర్పాటు చేస్తుండడం విశేషం. వీటిని శానిటైజ్ చేయాల్సిన అవసరం లేదు. అంతేకాదు, వీటిని మళ్లీ ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే కార్డుబోర్డు పై వైరస్ 24 గంటలకు మించి బతికి ఉండలేదు. అదే లోహం, ప్లాస్టిక్, చెక్కలపై ఐదు రోజుల వరకు జీవించి ఉండగలదు.  

ప్రభుత్వం. ఢిల్లీ-హర్యాలకు సరిహద్దు లో నెలకొల్పే ఈ కేంద్రం లో ఒక్కో ఎన్ క్లోజరు 1700ల అడుగుల పొడవు..700 అడుగుల వెడల్సు ఉంటుదని రాథా సోమి సత్సంగ్ బియాస్ కార్యదర్శి వికాస్ సేథి తెలిపారు. దేశం లో కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ ప్రభుత్వం ఈ ఆధ్యాత్మిక కేంద్రాన్ని  వైరస్ సెంటర్ గా మార్చాలని నిర్ణయించింది. ఈ కార్డుబోర్డు మంచాలు చాలా తేలికగా ఉంటాయి. వీటిని కలపడం, విడదీయడం చాలా తేలిక. ఈ మంచాలను సరఫరా చేస్తుండడం తమకు గర్వ కారణమని ధావన్ బాక్స్ షీట్ కంటైనర్స్ ప్రైవేటు లిమిటెడ్ డైరెక్టర్ విక్రమ్ ధావన్ తెలిపారు. ఈ మంచాలను తయారచేసి సరఫరా చేస్తున్నది ఈ కంపెనీయే

ఇటీవలి వరకు దీనిని వలస కార్మికుల కోసం ఉపయోగించినట్టు రాధా సోమి సత్సంగ్ బీస్, భాటి మైన్స్ కార్యాదర్శి వికాశ్ సేథీ తెలిపారు. ఈ కేంద్రంలోని పనులను పర్యవేక్షిస్తున్న దక్షిణ ఢిల్లీ కలెక్టర్ బీఎం మిశ్రా మాట్లాడుతూ ఈ కేంద్రం 500 పడకలు కలిగిన 20 చిన్న ఆసుపత్రుల్లా ఉంటుందని తెలిపారు.  ఛత్తార్ పూర్ లో రాధా సోమీ ఆధ్యాత్మిక కేంద్రం ఉంది. ఇది దాదాపు 12.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం లో ఉంటుంది. ఇక్కడ జరిగే సమావేశాలకు సుమారు 3 లక్షల మందికి పైగా హాజరవుతుంటారు. ఇక్కడి అన్ని ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు అమర్చబడి వున్నాయి. దీంతో కొవిడ్ చికిత్సా కేంద్రంగా ఈ సెంటర్ ను సులువు గా మార్చవచ్చని ప్రభుత్వం భావించింది.
Tags:    

Similar News