రాజకీయాల్లో పొత్తులు ఎందుకు పెట్టుకుంటారు? ఏ పార్టీ అయినా.. మరో పార్టీతో పొత్తులు పెట్టుకుంటే.. తద్వారా.. పార్టీకి ఏదైనా మేలు జరుగుతుందని.. లేకపోతే.. ఈ పొత్తు కారణంగా.. పుంజుకుంటామని.. పార్టీ లు అంచనా వేసుకుంటాయి.
ఈ రకంగా చూసుకుంటే.. ఏపీలో పొత్తు పెట్టుకున్న జనసేన-బీజేపీల మధ్య బంధాలను చూసుకుంటే.. అసలు వీరు పొత్తు ఎందుకు పెట్టుకున్నారు? అనే ప్రశ్న సాధారణంగానే తలె త్తుతోంది. ఎందుకంటే.. అసలు ఈ రెండు పార్టీల మధ్య సమన్వయం లేదు.
పైకి పొత్తులు పెట్టుకున్నట్టు కనిపించినా.. ఉమ్మడి కార్యాచరణ ఎక్కడా కనిపించదు. అంతేకాదు... ఎవ రూ కూడా నాయకులు కలిసి పనిచేస్తున్న దాఖలా కూడా లేదు. ఎవరికి వారుగానే పనిచేస్తున్నారు.. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఎవరి అజెండా వారిది... ఎవరి వ్యూహం వారిది అన్నట్టుగా ఈ రెండు పార్టీలు పని చేస్తున్నాయి.
నిజానికి పొత్తులు పెట్టుకున్న పార్టీలు.. కలిసి సంయుక్తంగా వేదికను పంచుకున్న దాఖలా ఇప్పటి వరకు లేదు. పోనీ.. ఒక కార్యక్రమం చేపట్టిన పరిస్థితి కూడా లేదు.
`` దేశంలో ఏ రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నా.. సంయుక్తంగా కార్యాచరణను ప్రకటిస్తాయి. సంయుక్తంగా ముందుకు సాగుతాయి. వచ్చే ఎన్నికలకు సంబందించి.. వ్యూహాలను ప్రకటిస్తాయి. కానీ, బీజేపీ-జనసేన ల మధ్య ఇలాంటి పరిస్థితి కనిపించడం లేదు. దీనికి కారణాలు ఏంటో ఆ రెండు పార్టీలు తెలుసుకోవాలి. పైకి మాత్రం పొత్తులు ఉన్నాయని అంటారు. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం ఈ రెండు పార్టీలు కలిసి ముం దుకు సాగుతున్న పరిస్థితి లేదు. ఇలా అయితే.. కష్టమే`` అని ఒక రాజకీయ విశ్లేషకుడు అభిప్రాయ పడ్డా రు.
ఇది కూడా నిజమే. ఈ రెండు పార్టీలు కలిసి.. ఇప్పటి వరకు ప్రజల్లోకి వెళ్లింది లేదు. ప్రజల సమస్యలు సంయుక్తంగా తెలుసుకుంది కూడా లేదు. ఆయా సమస్యలపై సంయుక్త కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది కూడా లేదు. వీరి కన్నా.. కమ్యూనిస్టు పార్టీలే బెటర్ అనుకునే పరిస్తితి ఉంది.. అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మరి ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీలు ఎలా ముందుకు సాగుతాయో చూడాలి.