మాట చెప్పినంత తేలిక కాదు దాన్ని చెప్పినట్లుగా అమలు చేయటం. ఎన్నో అవరోధాలు ఉంటాయి. అందునా.. ప్రభుత్వాలకు ఆర్థిక వనరుగా మద్యం ఆదాయం మారిన ప్రస్తుత పరిస్థితుల్లో ఆ ఆదాయాన్ని కోల్పోతామని చెప్పటం తొందరపాటే అవుతుంది. అలా అని విచ్చలవిడిగా వ్యవహరిస్తే విపరిణామాలు తప్పవు. అందుకే.. చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
ఈ విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంచనాలు తప్పైనట్లుగా కనిపిస్తోంది. ప్రభుత్వాన్ని కొలువు తీర్చిన వేళలో.. తొందరపాటుతో మద్య నిషేధం మీద ఆయన చెప్పిన మాటలు.. అందుకు తగ్గట్లు అనుసరించిన విధానాల కారణంగా రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం మొత్తం పోయిన పరిస్థితి.
అదే సమయంలో విమర్శలు.. ఆరోపణలు తరచూ భరించాల్సిన దుస్థితి. ఆదాయం పాయె.. మాట తప్పే అన్నట్లుగా ప్రస్తుత పరిస్థితి ఉందంటున్నారు. ఏపీ ప్రభుత్వమే మద్యం దుకాణాల్ని నిర్వహిస్తున్న ప్రస్తుత పరిస్థితికి భిన్నంగా ప్రైవేటు బాట పట్టే దిశగా సర్కారు ఆలోచిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఎప్పటిలానే ప్రైవేటు వ్యాపారులకు మద్యం దుకాణాల్ని అప్పజెప్పటం ద్వారా భారీ ఆదాయాన్ని ఆశిస్తున్నట్లుగా చెబుతున్నారు. దీనికి సంబంధించిన కీలక సమావేశం ఈ మధ్యనే జరిగినట్లుగా చెబుతున్నారు.
గత ఆర్థిక సంవత్సరంలో రూ.25 వేల కోట్ల విలువైన మద్యాన్ని అమ్మటం ద్వారా రూ.20వేల కోట్ల ఆదాయాన్ని రాబట్టింది. ఇప్పుడున్న అవసరాలకు ఈ మొత్తం అస్సలు సరిపోని పరిస్థితి. అందుకే మద్యం మీద మరింత ఆదాయానికి వీలుగా ఉన్న మార్గాల్ని వెతికినప్పుడు.. ప్రైవేటుకు అప్పజెప్పటం మినహా మరో మార్గం లేదన్న వాస్తవాన్ని గుర్తించినట్లుగా చెబుతున్నారు. ఆదాయాన్ని పెంచుకోవటానికి అమ్మకాల్ని ప్రోత్సహించాల్సి ఉంటుంది. అందుకు మిగిలిన రాష్ట్రాల్లో మాదిరి అన్నిబ్రాండ్లను అందుబాటులోకి తేవటంతో పాటు.. ధరల్ని కూడా మిగిలిన వారి మాదిరి ఫాలో కావాల్సి ఉంది.
ఈ విషయంలో ప్రభుత్వం తీరు తేడాగా ఉండటంతో.. ఏపీకి సరిహద్దు రాష్ట్రాలైన తెలంగాణ.. తమిళనాడు.. కర్ణాటక.. ఒడిశా.. మహారాష్ట్ర.. గోవాల నుంచి అక్రమంగా మద్యం రాష్ట్రంలోకి వస్తోంది. దీని కారణంగా ప్రభుత్వానికి రావాల్సిన విలువైన ఆదాయాన్ని మిస్ చేసుకుంటోంది. రాష్ట్రంలో ఖరీదైన మద్యాన్ని సేవించే వారు.. ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించుకుంటున్నారే కానీ.. ఏపీ ప్రభుత్వం అమ్ముతున్న పరిమిత బ్రాండ్లను అస్సలు ముట్టుకోవట్లేదు. దీని కారణంగా ఖర్చు ఏపీ ప్రజలు చేస్తున్నా.. దానికి సంబంధించిన ఆదాయం మాత్రం ఇతర రాష్ట్రాల ఖజానాలకు వెళుతున్న దుస్థితి.

అందుకే.. మిగిలిన రాష్ట్రాల మాదిరి.. ఏపీలోని మద్యం షాపుల్ని నిర్వహించుకునేందుకు వీలుగా ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పటంతో పాటు పాత విధానాన్ని అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు. అదే జరిగితే.. ఇంతకాలం దశల వారీగా మద్యపాన నిషేధం గురించి బోలెడన్ని మాటలు చెప్పిన ప్రభుత్వం మీద విమర్శలు వెల్లువెత్తటం ఖాయం.
అందుకే.. దాన్ని ఎదుర్కొనేందుకు వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నట్లుగా చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. మాట తప్పని.. మడమ తిప్పని జగన్మోహన్ రెడ్డి.. రాష్ట్ర ఖజానాకు అవసరమైన ఆదాయం కోసం ఈసారికి తిప్పక తప్పని పరిస్థితన్న మాట వినిపిస్తోంది. దానికి సంబంధించిన సీన్ త్వరలోనే తెర మీదకు వస్తుందంటున్నారు.