ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ సైనిక చర్య ప్రారంభమై మూడో వారానికి చేరుకుంది. కానీ ఉక్రెయిన్ లోని చాలా ప్రాంతాల్లో ప్రశాంత వాతావరణం కరువైంది. యుద్ధం ప్రారంభించిన తొలి రోజు నుంచి రష్యా ఏ విధంగా అయితే దాడులకు తెగబడిందో.. ఇప్పటికీ అలాగే కొనసాగిస్తోంది.
రష్యా ప్రయోగిస్తున్న బాంబులు, క్షిపణి దాడులకు ఉక్రెయిన్ లోని చాలా నగరాలు చిరుగుటాకుల్లా వణుకుతున్నాయి. ప్రజలు లక్ష్యంగా చేసుకుని రష్యా సేనలు దాడులకు పాల్పడుతున్నాయని ఉక్రెయిన్ ఇప్పటికే చాలా సార్లు చెప్పింది. కానీ ఈ వార్తలను రష్యా ఖండిస్తుంది. ఇదిలా ఉంటే ఉక్రెయిన్ లోని చాలా ప్రాంతాల్లో శవాల దిబ్బలు దర్శనం ఇస్తున్నాయని ఉక్రెయిన్ లోని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు.
యుద్ధం ప్రారంభం అయినప్పుడు పుతిన్ సేనలు మహా అంటే రెండు రోజల్లో పక్కా గా ఉక్రెయిన్ ను అధీనంలోకి తీసుకుంటాయిని అందరూ భావించారు. ఇందుకు సంబంధించిన కథనాలు కూడా అంతర్జాతీయ మీడియా చాలా సార్లు ప్రచురించింది. కానీ అందుకు భిన్నంగా యుద్ధం భూమిలో ఉక్రెయిన్ కదం తొక్కింది. దూసుకు వస్తున్న శత్రుసేనలను పట్టి ఆపింది. అత్యంత అత్యాధునిక ఆయుధాలు, రక్షణ వ్యవస్థలను కలిగిన రష్యా కు కథన రంగంలో చుక్కలు చూపిస్తోంది. అయితే ఓ చిన్న దేశం కు ఇది అంతా ఎలా సాధ్యం అయ్యింది. దీనికి గల కారణాలు ఏంటి.. ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అగ్రరాజ్యం అయిన అమెరికా దీవెనలు ఉక్రెయిన్ పై చాలా బాగున్నాయి. దీంతోనే ఉక్రెయిన్ యుద్ధ భూమిలో రష్యా ను ఎదుర్కొంటుందని చెప్తున్నారు. రష్యాతో యుద్ధం చేస్తుంది పైగా ఉక్రెయిన్ అయినా.. పరోక్షంగా మాత్రం అమెరికా అనే చెప్పాలి అని అంటున్నారు నిపుణలు. అవసరం అయిన అన్ని రంగాల్లో ఉక్రెయిన్ కు సహాయం అందిస్తుంది అమెరికా. కేవలం అమెరికా ఒక్క దేశం మాత్రమే కాదు. నాటో లోని ఇతర సభ్య దేశాలు కూడా ఉక్రెయిన్ కు అండగా నిలుస్తున్నాయి.
భారీ స్థాయిలో ఆయుధాలను ఉక్రెయిన్ కు అందిస్తున్నాయి. దీంతో జెలెన్ స్కీ సేనలు రష్యాను ధీటుగా ఎదుర్కొని ముందుకు సాగుతున్నాయి. ఇప్పటి వరకు సుమారు 17 వేలకు పైగా కీలక అస్త్రాలను ఉక్రెయిన్ కు అందించాయని చెప్తున్నారు. వాటిలో ప్రధానమైన అత్యంతం శక్తిమంతమైన జావెలిన్ క్షిపణులు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. వీటితో పాటు సైబర్ రంగం లోని అమెరికా, మిత్ర పక్షాలు భారీగా సహాయం చేస్తున్నారు.
ఉక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఓ సరుకు రవాణా విమానం సేవలు ఇప్పుడు చాలా కీలకంగా మారాయి. దాని పేరే ఏఎస్-124. అమెరికా దాని మిత్రపక్షాలు అందిస్తున్న ఆయుధ సాయాన్ని ఉక్రెయిన్ సేనలకు అందిస్తున్న విమానం ఇది. ఆయా దేశాలు ప్రకటించిన ఆయుధాలు పోలాండ్, రుమేనియా లో ఉండే ఎయిర్ బేస్ ద్వారా ఉక్రెయిన్ కు చేర్చుతుంది. అయితే గతంలో ఉక్రెయిన్ కు ప్రకటించిన మొత్తం కంటే ప్రస్తుతం ఇప్పుడు భారీగా ఆయుధాలు అందిస్తున్నాయి నాటో దేశాలు.
యుద్ధం ప్రారంభం అయిన నాటి నుంచి అమెరికా ప్రకటించిన ఆయుధ సాయంతో ఇప్పటికే సుమారు 70 శాతానికిగా పై అందజేయడం విశేషం. అయితే గత కొద్ది రోజులుగా ఆయుధాలను ఉక్రెయిన్ కు అందజేయాలంటే కష్టంగా మారుతోందని చెప్తున్నారు అమెరికా రక్షణ శాఖ అధికారులు. ఉక్రెయిన్ కు మరికొన్ని యుద్ధం విమానాలను అందించే ప్రతిపాదనను కూడా అమెరికా పరిశీలిస్తుంది. అయితే ఇందుకు పోలాండ్ ఉక్రెయిన్ కు సహాయం చేయాల్సి ఉంటుంది. దీనికి గల ప్రధాన కారణం... పోలాండ్ దగ్గర ఉన్న యుద్ధం విమానాలను ఉక్రెయిన్ వైమానిక దళం నడపగలుగుతుంది. ఈ కారణంగా పోలాండ్ సహాయం చేయాల్సి ఉంటుంది.
రష్యా దాడులకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పడు ఉక్రెయిన్ కు అందజేస్తున్నాయి నాటో సభ్య దేశాలు. రష్యా కమ్యూనికేషన్ వ్యవస్థలపై ఓ కన్నేసి ఉంచి ఉక్రెయిన్ కు సమాచారం అందిస్తున్నాయి. రష్యా సేన కదలికలకు సంబంధించిన సమాచారం కూడా అమెరికా రక్షణ సంస్థలు ఉక్రెయిన్ కు చేరవేస్తున్నాయి. గతంలో జరిగిన విధంగా మరో సారి సైబర్ దాడులు జరగకుండా మద్దతు అందిస్తుంది అమెరికా.
ఇందుకు ఏకంగా మైక్రోసాఫ్ట్ నే రంగంలోకి దించింది. మరోవైపు ఉక్రెయిన్ కు అనుకూలంగా చాలా మంది లాబీయింగ్ చేస్తున్నారు. గతంలో భారీ మొత్తాన్ని వెచ్చించి తీసుకునే వారు ఇప్పుడు రూపాయి కూడా అడగ్గకుండా ప్రపంచ శాంతి కోసం ఎటువంటి వాటికోసం అయిన అమెరికాను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.