ఏపీలో వచ్చేది సంకీర్ణ సర్కారేనా. ఉమ్మడి ఏపీలో చూసుకున్నా కూడా ఎపుడూ ఏదో ఒక పార్టీకి ఫుల్ మెజారిటీనే ప్రజలు ఇచ్చారు. ఇక నాడు చూస్తే అయితే కాంగ్రెస్ లేకపోతే టీడీపీ అన్నట్లుగా పరిస్థితి ఉండేది. విభజన ఏపీలో కూడా టీడీపీ ఒకసారి వైసీపీ ఒకసారి పూర్తి ఆధిక్యతతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. మరి 2024లో ఏం జరగనుంది అంటే దాని మీద కూడా అనేక రకాలుగా విశ్లేషణ జరుగుతోంది
ఏపీలో ప్రస్తుతం వైసీపీకి 151 సీట్లు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ ఇన్ని సీట్లు సాధిస్తుందా అంటే డౌటే అని చెప్పాలి. రీసెంట్ గా యూపీ ఎన్నికలనే తీసుకుంటే బీజేపీ తన మిత్రులతో కలిపి 325 సీట్లను 2017లో సాధిస్తే అది కాస్తా తాజా ఎన్నికల్లో 274కి పడిపోయింది. అంటే దాదాపుగా యాభై సీట్లు కోతపడ్డాయి. కానీ వరసగా రెండవసారి అధికారంలోకి రావడమే అసలైన విజయం అని బీజేపీ చెప్పుకుంటోంది.
ఇక యూపీలో బీజేపీ విజయానికి విపక్షాల ఓట్ల చీలిక కూడా ప్రధాన కారణం అని అంతా అంటారు. అన్ని పార్టీలు కూటమిగా పోటీ చేస్తే బీజేపీ విపక్షానికే పరిమితం అయ్యేది అన్న చర్చ కూడా ఉంది. ఏపీలో కూడా అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలనే జనసేనాని పవన్ కళ్యాణ్ విపక్ష ఓట్లు ఒక్కటీ ఈసారి చీలకూడదు అని భారీ శపధమే చేస్తున్నారు.
అయితే ఏపీలో మహా కూటమి ఏర్పాటు అవుతుందని ఎవరూ అనుకోవడంలేదు. బీజేపీ ఉన్న చోట కాంగ్రెస్, కామ్రేడ్స్ ఉండరని తెలిసిందే. దాంతో 2014 మాదిరిగానే జనసేన, బీజేపీ టీడీపీతో కూటమి ఏర్పడే చాన్స్ అయితే ఉంది. మరి ఈ కూటమి బలంగానే వైసీపీని ఢీ కొట్టడం ఖాయం.
అదే టైమ్ లో అధికార వైసీపీకి ఉన్న యాంటీ ఇంకెంబెన్సీ తోడు అయితే అధికారం చేతులు మారినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక విపక్ష కూటమి అధికారంలోకి వస్తే అది టీడీపీ సర్కార్ అవుతుందా అంటే ఈసారి అయ్యే సీనే లేదు అంటున్నారు. వచ్చేది సంకీర్ణం అని కూడా చెబుతున్నారు. ఇదే విషయాన్ని చూచాయగా పవన్ కళ్యాణ్ ఆవిర్భావ సభలో ఇప్పటికే చెప్పేసారు. ఆయన ప్రజా ప్రభుత్వం అన్న పదం వాడారు.
అంటే ఫలానా పార్టీ సర్కార్ అని కాకుండా మూడు పార్టీల భాగస్వామ్యం ఈసారి తప్పకుండా ఉంటుంది అంటున్నారు. ఇక 2024లో బీజేపీతో పొత్తు ఉన్నా టీడీపీ మొత్తం 163 సీట్లలో పోటీ చేసి వందకు పైగా స్థానాలను సొంతంగా సాధించింది. అయితే పొత్తు సంప్రదాయాన్ని అనుసరించి బీజేపీ తరఫున గెలిచిన నలుగురిలో ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చింది.
కానీ ఈసారి అలా సీట్ల షేరింగ్ ఉండే ప్రసక్తే లేదని జనసేన నుంచి వినిపిస్తున్న మాట. మొత్తం 175 సీట్లకు గానూ టీడీపీని వందకు మాత్రమే పరిమితం చేసి మిగిలిన 75 సీట్లలో జనసేన 60, బీజేపీ 15 సీట్లను తీసుకుంటాయని ప్రచారం సాగుతోంది. ఆ విధంగా చూస్తే పోటీ చేసిన వంద సీట్లలో టీడీపీకి మ్యాజిక్ ఫిగర్ అయిన 88 సీట్లు రాకపోవచ్చు. అపుడు జనసేన, బీజేపీ మద్దతుతోనే కొత్త సంకీర్ణం తొలిసారిగా ఏపీలో ఏర్పాటు అవుతుంది అంటున్నారు.
అలాగే జరగాలని, తమ ప్రాధాన్యత కొత్త ప్రభుత్వంలో పెరగాలని జనసేన అయితే బలంగా కోరుకుంటోంది. కొత్త ప్రభుత్వంలో టీడీపీని కంట్రోల్ చేయాలన్నా తమ మాట నెగ్గించుకోవాలన్న సీట్ల దగ్గర ఒప్పందాలే కీలకమని జనసేన భావిస్తోంది. అందుకే ఏదో మొక్కుబడిగా పాతిక ముప్పయి సీట్లను తీసుకుని పోటీ చేయకుండా వచ్చే ప్రభుత్వంలో తాము కీలకమైన భూమిక పోషించాలన్నదే జనసేన అజెండా అంటున్నారు.
ఆ విధంగా టీడీపీని మానసికంగా సిద్ధం చేయడానికే పవన్ ఏపీ వికాసం కోసం రాజకీయ లాభాలను పక్కన పెట్టి రావాలని పిలుపు ఇచ్చారని అంటున్నారు. మరి టీడీపీ అయితే 140కి తగ్గకుండా పోటీ చేసి మ్యాజిక్ ఫిగర్ ని అందుకోవాలని చూస్తోంది. మిత్రులకు సీట్లు ఇచ్చినా వాటి మద్దతు మీద ఆధారపడని సర్కార్ రావాలని, అది టీడీపీ ప్రభుత్వంగానే చలామణీ కావాలన్నది ఆ పార్టీ కోరిక. మరి అది జరుగుతుందా. వేచి చూడాల్సిందే.