‘ఆరు’ వదిలేసి ఈ ‘మూడు’ మీద దండయాత్రేంది సారూ?

Update: 2022-03-08 01:30 GMT
‘ఆరు’ అన్నంతనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సారు ఇట్టే గుర్తుకు వస్తుంటారు. ఆయనకు.. ఆరుకు మధ్యనున్న రిలేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేసీఆర్ కు వ్యక్తిగతంగా ‘ఆరు’ కలిసి వస్తుందని బలంగా నమ్ముతారు. ఇందుకు తగ్గట్లే.. ఆయన ఏదైనా ముఖ్యమైన పని చేయాలనుకున్నప్పుడు ఆరు అంకెను మిస్ కాకుండా చూసుకోవటం కనిపిస్తుంది.

అయితే.. ఇటీవల ఆయన విషయంలో చోటు చేసుకున్న పరిణామాల్ని చూస్తుంటే. ఆరు నుంచి ఆయన మూడుకు షిఫ్టు అయ్యారా? అన్నది ప్రశ్నగా మారింరరరరది. ఈ మధ్యనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని ధూంధాంగా నిర్వహించాలని గులాబీ పార్టీ డిసైడ్ చేయటం ఒక ఎత్తు అయితే.. రాష్ట్ర మంత్రి కేటీఆర్ మాత్రం టీఆర్ఎస్ శ్రేణులతో మాట్లాడిన సందర్భంలో.. గులాబీ బాస్ బర్త్ డే వేడుకల్ని భారీ ఎత్తున నిర్వహించాలని కోరటం తెలిసిందు. ఇందుకు తగ్గట్లే రంగంలోకి దిగిన గులాబీ దండు.. సీఎం సారు పుట్టిన రోజు వేడుకల్ని ఎంత భారీగా నిర్వహించారో తెలిసిందే.  

పెద్ద సారు వారి పుట్టిన రోజు వేడుకల్ని చిన్నసారు స్వయంగా పర్యవేక్షించటంతో గులాబీ నేతలు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని సక్సెస్ చేశారు. ఇదిలా ఉంటే.. మంగళవారం మహిళా దినోత్సవం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకల్ని ఒక రోజు నిర్వహించటం ఏమిటి? మూడు రోజులు నిర్వహిద్దామన్న మాటతో గులాబీ దండు మరోసారి తమ సత్తా చాటుతోంది.

ఇదంతా చూస్తే.. మొన్నటివరకు ఆరుకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన కేసీఆర్.. ఇటీవల మూడుకు షిప్టు అయ్యారా? అన్న అనుమానం కలుగుతోంది. ఇప్పుడు బీజేపీ..కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా జాతీయస్థాయిలో మూడో కూటమిని ఏర్పాటు చేయాలని తపిస్తున్న కేసీఆర్.. మాటలతోనే కాదు.. చేతల్లోనూ ‘మూడు’ అదే పనిగా తెర మీదకు తీసుకొస్తున్నారా? అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News