ఈ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కామసృష్టి.. 4000 న్యూడ్ ఫొటోలు.. వీడియోలు.. అరెస్ట్
పేరుకు గౌరవప్రదమైన సాఫ్ట్ వేర్ ఇంజినీర్.. పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీలో ఉద్యోగం.. లక్షల జీతం.. కానీ ఇతడి కామబుద్ది మాత్రం వెరైటీ. పెద్ద హోదాలో ఉన్నా కూడా లోపల మాత్రం చాలా కన్నింగ్ బుద్దులు ఉన్నాయి. అతడు చేసే చెత్త పనులకు ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కిస్తున్నాడు.
మహిళలను బెదిరించడం.. వాళ్ల నుంచి నగ్న చిత్రాలు తీసుకోవడం.. వాటిని పోర్న్ సైట్స్ కు అమ్మడం.. ఇది అతడి సైడ్ బిజినెస్ గా మారింది. అతడి పేరు మోహిత్ శర్మ. ఈ మేకవన్నె పులిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇంజినీరింగ్ చేసిన మోహిత్ శర్మ ఆ తర్వాత ఎంబీఏ చదివాడు. పెద్ద సాఫ్ట్ వేర్ సంస్థలో ఉద్యోగం సంపాదించాడు. కానీ సైడ్ బిజినెస్ కింద అమ్మాయిలను వేధించడం పనిగా పెట్టుకున్నాడు. దీనికోసం అతడో ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ను క్రియేట్ చేశాడు. అమ్మాయిలకు వల వేయడం.. వాళ్ల బలహీనతలను క్యాష్ చేసుకొని నగ్నంగా దిగిన ఫొటోలను సేకరించడం హాబీగా మార్చుకున్నాడు.
అయితే చాలా మంది వీడి బాగోతాలకు బలయ్యారు.కానీ రెండేళ్లలో ఇద్దరు ధైర్యం చేసి ఫిర్యాదు చేశారు. తమను బెదిరించి న్యూడ్ ఫొటోలు తీసుకున్నాడంటూ ఇద్దరు మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఢిల్లీ సైబర్ పోలీసులు విచారణ మొదలుపెట్టారు. ఇన్ స్టాగ్రామ్ ఐడీ, దానికి అనుబందం ఈమెయిల్ ఆధారంగా అడ్రస్ ట్రాక్ చేశారు.
నొయిడాలోని ఓ ఇంటి నుంచి ఇదంతా జరుగుతున్నట్టు పసిగట్టి ఇంటి తలుపు తట్టారు. మోహిత్ శర్మను విచారించారు. తన వైఫై హ్యాక్ అయ్యిందని.. దీనిపై ఫిర్యాదు కూడా చేశానని బుకాయించాడు. మోహిత్ వ్యక్తిగత ల్యాప్ ట్యాప్ ఓపెన్ చేసి చూసిన పోలీసులకు దిమ్మదిరిగిపోయింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 4 వేల న్యూడ్ ఫొటోలు దర్శనమిచ్చాయి.
వీటన్నింటిని ఇతడు వేధించి వల వేసి.. డబ్బులు ఇచ్చి సంపాదించినట్టు గుర్తించారు.వీటిలో చాలా ఫొటోలను ఇప్పటికే పోర్న్ సైట్స్ కు అమ్మేసినట్లు గుర్తించారు. ఆ డబ్బు కూడా అతడి అకౌంట్ లో పడిన విషయాన్ని నిర్ధారించారు. దీంతో తప్పు ఒప్పుకున్నాడు. డేటా స్వాధీనం చేసుకొని 33 ఏళ్ల మోహిత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.