పిట్ట శ‌ప‌థ‌లా.. గ‌ట్టి శ‌ప‌థాలా..? వైసీపీలో చ‌ర్చ‌

Update: 2022-03-02 12:30 GMT
ఇటీవ‌ల కాలంలో వైసీపీ గురించి ప‌లువురు నాయ‌కులు శ‌ప‌థాలు చేస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీని ఓడించి తీరుతామ‌ని.. చెబుతున్నారు. వీరిలో టీడీపీ నాయ‌కులు.. జ‌న‌సేన నాయ‌కులు.. బీజేపీ నాయ‌కు లతో పాటు, కొన్ని సామాజిక వ‌ర్గాల‌కు చెందిన నాయ‌కులు కూడా ఉన్నారు. ఈ క్ర‌మంలో అస‌లు ఈ శ‌ప థాలు నెర‌వేరేనా? అనేది.. అధికార పార్టీ నేత‌ల మ‌ధ్య ఆస‌క్తిక‌ర చ‌ర్చగా సాగుతోంది.

త‌మ డిమాండ్లు నెర‌వేర్చ‌క‌పోతే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఓడించి తీరుతామ‌ని.. ఒక సామాజిక వ‌ర్గం ఇటీవ‌ల పేర్కొంది.

నిజానికి ఆ సామాజిక వ‌ర్గానికి గ‌తంలో ఉన్న ప్ర‌భుత్వం హ్యాండిస్తే.. జ‌గ‌న్ వ‌చ్చిన త‌ర్వాత‌.. మంత్రి ప‌ద‌వులు ఇచ్చారు. కార్పొరేష‌న్‌కు నిధులు కూడా ఇస్తున్నారు.అదేస‌మ‌యంలో ప్రాధాన్యం కూడా ఇస్తున్నారు. కానీ, ఈ సామాజక వ‌ర్గం మాత్రం నిప్పులు చెరుగుతోంది. ఇక‌, టీడీపీ నేత‌లుస‌రే స‌రి.

అదేస‌మ‌యంలో బీజేపీ నాయ‌కులు కూడా బ‌లం లేక‌పోయినా.. జ‌గ‌న్‌ను ఓడించేస్తామ‌ని.. ప‌దే ప‌దే చెబుతున్నారు. త‌మ స‌త్తా చాటుతామ‌ని.. సోము వీర్రాజు వంటివారు కూడా చెబుతున్నారు.ఇక‌, జ‌న‌సేన నాయ‌కులు మ‌రింత దూకుడుతో ఉన్నారు.

ఇలా .. ఈ పార్టీల నాయ‌కులు చేస్తున్న శ‌ప‌థ‌కాలు.. పిట్ట శ‌ప‌థాలా? గ‌ట్టి శ‌ప‌థాలా?  అనేది ఆస‌క్తిగా మారింది. ఇదే విష‌యంపై వైసీపీ నాయ‌కులు కూడా చ‌ర్చించుకుంటున్నారు. ఎందుకంటే.. ఏదైనా శ‌ప‌థం చేస్తే.. దానిని నెర‌వేర్చుకునే వ‌ర‌కు నాయ‌కులు శ్ర‌మించాలి.

గ‌తంలో జ‌గ‌న్ ఏదైనా శ‌ప‌థం చేస్తే.. దానిని చెప్పేవారు. మ‌న‌సులోనే పెట్టుకుని.. దానిని సాధించిన త‌ర్వాత చెప్పుకొనే వారు. కానీ, ఇప్పుడు నాయ‌కులు చాలా డిఫ‌రెంట్‌గా ఉన్నారు. ఈ క్ర‌మంలోనే వారు పైకి ప్ర‌జ‌ల మైండ్‌ను డైవ‌ర్ట్ చేసేందుకు .. ప్ర‌య‌త్నిస్తున్న క్ర‌మంలోనే ఈ శ‌ప‌థాలు చేస్తున్నార‌ని.. నిజంగానే శ‌ప‌థంపై ల‌క్ష్యం ఉంటే. ఇప్ప‌టికే జ‌నాల్లోకి వెళ్లి ఉండేవారని వైసీపీ నాయ‌కులు తేల్చేస్తున్నారు. ఇదీ సంగ‌తి!
Tags:    

Similar News