విదేశీ పర్యటనలనగానే ప్రధాన మోదీ గురించే అంతా మాట్లాడుతారు కానీ, ఏపీలో చంద్రబాబు ప్రభుత్వంలోని మంత్రులు - అధికారులు - స్వయంగా సీఎం కలిసి విదేశీ పర్యటనలకు ఎన్నిసార్లు తిరిగారు.. అసలా యాత్రల వల్ల ఎంత ఫలితం వచ్చిందన్నది తెలిస్తే షాకవ్వాల్సిందే. ఈ వివరాలన్నిటితో తాజాగా ప్రముఖ పత్రిక మొదటి పేజీలో కథనం అచ్చేసింది. నిజానికి పత్రిక అంటే చంద్రబాబుకు అనుకూలంగా ఉండే పత్రికన్న ముద్ర ఉంది. రాజకీయంగా ఇలాంటి స్టాండ్ ఉంటే ఉండొచ్చు కానీ, ప్రభుత్వం వైపు నుంచి భారీ తప్పులు జరుగుతుంటే మాత్రం వాటిని ఉతికి ఆరేసిన సందర్భాలూ గతంలోనూ ఉన్నాయి.
చంద్రబాబు ప్రభుత్వం తీరుపై ఎంత చిరాకేసిందో ఏమో కానీ తాజాగా ఆ పత్రిక మరోసారి అదే పని చేసింది. అడ్డగోలుగా విదేశీ యాత్రల పేరిట జనం డబ్బును తగలబెడుతుంటే పక్కా ఆధారాలతో బయటపెట్టింది. ఇంతవరకు 481 మార్లు విదేశీ పర్యటనలు చేశారని ఆ కథనం బయటపెట్టింది. మరి... పూర్తి ఆధారాలు దొరకలేదో లేదంటే ప్రస్తుతానికి ఇది చాలు అనుకుందో ఏమో కానీ అందుకు అయిన ఖర్చు వివరాలు మాత్రం అందులో చెప్పలేదు.
అధికారం చేపట్టిన తరువాత సీఎం చంద్రబాబునాయుడు ఈ మూడేళ్లలో పదమూడు దేశాలలో పర్యటించారని - ఏభై ఏడు రోజులు విదేశాలలో ఉన్నారని ఆ కథనంలో పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ విధానాల పరిశీలన, నూతన ఆవిష్కరణలపై అధ్యయనం - పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యాల పేరుతో గత రెండున్నరేళ్లలో రాష్ట్ర మంత్రులు- ఉన్నతాధికారులు - ఉద్యోగులు - సలహాదారులు కలిసి.. 481 సార్లు విదేశీ పర్యటనలు చేశారట. అంటే సుమారుగా రెండు రోజులకో విదేశీ పర్యటన అన్న మాట.
కాగా ఈ పర్యటనల తరువాత ఫలితాలు మాత్రం అంతంతేనట. కొందరైతే తిరిగొచ్చాక తాము ఏం చేశాం, ఏం చూశాం.. ఏం చేయాలన్న నివేదిక కూడా ఇవ్వలేదంటే నమ్మండి. రాష్ట్రంలో సీనియర్ ఐఏఎస్ అధికారి నుంచి జూనియర్ అసిస్టెంట్ వరకూ విదేశాల్లో పర్యటిస్తూనే ఉన్నారు. ఒక్కో పర్యటనకు రూ.లక్షల్లో వ్యయం అవుతోంది. వెళ్లి వచ్చినవారు ఆ లెక్కలూ చూపరు. ఇటీవల ఓ మంత్రి - ప్రధాన కార్యదర్శి అమెరికా వెళ్తూ సుమారు రూ.40 లక్షలు ముందస్తుగా తీసుకుని ఇప్పటివరకు ఆ లెక్కలు చూపలేదన్న ఆరోపనలున్నాయి.
కాగా ఐఏఎస్ ల్లో అజయ్ జైన్ దాదాపు 80 రోజులు విదేశాల్లో ఉన్నారట. రు. నిబంధనల ప్రకారం అధికారులు పర్యటన ముగించుకొచ్చిన వారంలోగా నివేదికను సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)కు ఇవ్వాలి. అజయ్ జైన్ 15 పర్యటనలకు గాను మూడింటికే నివేదిక ఇచ్చారు. సీఎంఓ కార్యదర్శుల్లో జి.సాయిప్రసాద్ ఎక్కువగా ముఖ్యమంత్రి పర్యటనల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రితో పర్యటనలకు వెళ్లిన సందర్భాల్లో ఏ అధికారీ నివేదిక సమర్పించడం లేదని జీఏడీ వర్గాలు చెబుతున్నాయి. ఆదిత్యనాథ్ దాస్ - రావత్ - మన్మోహన్ సింగ్ - పీవీ రమేష్ తదితర సీనియర్ అధికారులూ నివేదికలు ఇవ్వలేదట. ప్రస్తుత డీజీపీ సాంబశివరావు (ఆర్టీసీ ఎండీ హోదాలో)లు కూడా నివేదికలు ఇవ్వని వారిలో ఉన్నారట. ఈ రెండున్నరేళ్లలో నేతా - అధికార గణాలు ఎక్కువగా సింగపూర్ - అమెరికా - యూకే - చైనా - యూఏఈల్లో పర్యటించాయి.