ప్రత్యేక హోదా అంశం ఇప్పుడు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మెడకు చుట్టుకుందా? అంటే ఔననే సమాధానమే వస్తోంది. ఆయనను ఏపీలో అడుగుపెట్టనివ్వబోమని కామ్రేడ్లు తెగేసి చెబుతుండడం గమనార్హం. వాస్తవానికి ప్యాకేజీ వచ్చేందుకు వెంకయ్య ఎంతో చేశారని ఏపీ బీజేపీ నేతలు పొగడ్తల జల్లు కురిపిస్తుండడమే కాకుండా.. శనివారం విజయవాడలో భారీ ఎత్తున ఆయనకు ఘనంగా సన్మానం చేయాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే ప్యాకేజీపై జోష్ లో ఉన్న ఏపీ బీజేపీ నేతలు ఢిల్లీ వెళ్లి మరీ ప్రధాని మోడీని - ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని - కమల సారధి అమిత్ షాని కలిసి అభినందనలు తెలిపివచ్చారు.
ఇక, ఇప్పుడు వెంకయ్యకి విజయవాడలో భారీ ఎత్తున సన్మానం చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్న కామ్రెడ్లు.. వెంకయ్యకు షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. గన్నవరం ఎయిర్ పోర్టుకు విమానం లో చేరుకునే వెంకయ్యకు హోదా సెగ చూపించాలని డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలో వెంకయ్య కాన్వాయ్ ప్రయాణించే విజయవాడ రామవరప్పాడు రింగ్ రోడ్డులో కామ్రేడ్లు భారీఎత్తున శనివారం ఉదయమే మోహరించారు. ప్రత్యేక హోదా నినాదాలతో హోరెత్తించారు. వెంకయ్య ద్రోహి అని విమర్శలు గుప్పించారు.
వెంకయ్యకు రాష్ట్రంలో అడుగుపెట్టే అర్హత లేదంటూ వామపక్ష పార్టీల నేతలు మీడియాతో అన్నారు. . హోదా సాధించకుండా వెంకయ్య ఆంధ్ర ప్రజలను నమ్మించి మోసం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే, పోలీసులు ఎంటర్ అయిపోయి.. కామ్రెడ్లను ఓ వ్యాన్ లోకి ఎక్కించి అక్కడి నుంచి తరలించేశారు. కానీ, కామ్రెడ్లు మాత్రం వెంకయ్యకు షాక్ ట్రీట్ మెంట్ ఇస్తామని చెబుతున్నారు.
మరోపక్క, బీజేపీ నేతలు మాత్రం వెంకయ్యకు ఎయిర్ పోర్టు నుంచే ఘన స్వాగతం పలుకేందుకు రెడీ అయ్యారు. అనంతరం ఆయనకు పెద్ద ఎత్తున సన్మానం చేయనున్నారు. ఏదేమైనా.. కామ్రెడ్ల నిరసన వెంకయ్యకు చేదు అనుభవంగానే మిగలనుంది.