స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ లో చిరుత మూత్రం ఎందుకు వాడారంటే

Update: 2018-09-12 13:04 GMT
2016 సెప్టెంబ‌ర్ 29న భార‌త భ‌ద్ర‌తా ద‌ళాలు స‌రిహ‌ద్దు రేఖ వ‌ద్ద పాక్ ఆక్ర‌మిత్ క‌శ్మీర్‌ లో స‌ర్జిక‌ల్ దాడులు చేసిన తీరు ప్ర‌పంచం చూపును భార‌త్ వైపు తిప్పిన సంగ‌తి తెలిసిందే. ర‌హ‌స్య ఆప‌రేష‌న్ ఎలా సాగింద‌న్న వాస్త‌వాలు బ‌య‌ట‌కు రాలేదు. తాజాగా మ‌రో ఆస‌క్తిక‌ర విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ఓ సీనియర్ ఆఫీసర్ ఇవాళ ఆ ఆపరేషన్‌ కు సంబంధించిన ఓ విషయాన్ని వెల్లడించారు. లెఫ్టినెంట్ జనరల్ ఆర్ ఆర్ నింబోకర్ ఈ విషయాన్ని తాజాగా వెల్లడించారు. కాగా సర్జికల్‌ స్ట్రైక్స్‌ కు ప్రణాళిక రచించడంలో - విజయవంతగా అమలు చేయడంలో నింబోర్కర్‌ కీలకంగా వ్యవహరించారు.

క‌శ్మీర్‌లో యూరీ దాడి జ‌రిగిన త‌ర్వాత భార‌త ఆర్మీ స‌ర్జిక‌ల్ దాడుల‌కు ప్ర‌ణాళిక వేసింది. అయితే అమావాస్య రోజున ఈ ఆప‌రేన్ నిర్వ‌హించాల‌ని అనుకున్నారు. అమాస్య రోజున వెన్నెల ఉండ‌దు క‌నుక ఆప‌రేష‌న్ సులువుగా సాగుతుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. దీంతో సెప్టెంబ‌ర్ 29న‌ మేజ‌ర్ రోహిత్ సూరీ నేతృత్వంలోని ఎనిమిది మంది స‌భ్యుల బృందం స‌ర్జిక‌ల్ దాడుల‌కు వెళ్లింది. ఆప‌రేష‌న్‌ కు సంబంధించిన రెక్కీ వేసిన మేజ‌ర్ సూరి ఆ త‌ర్వాత త‌న టీమ్‌ ను ఆదేశించాడు. మొదట కేవ‌లం 50 మీటర్ల దూరం నుంచే ఇద్ద‌రు ఉగ్ర‌వాదుల‌ను హ‌తం చేశారు. అదే స‌మ‌యంలో మ‌రో ఇద్ద‌రి ఉగ్ర‌వాదుల క‌ద‌లిక‌ల‌ను గుర్తించిన సూరి - త‌న ప్రాణాల‌ను లెక్క చేయ‌కుండా ఒంట‌రిగా ముందుకు వెళ్లి వాళ్ల‌ను హ‌త‌మార్చాడు. మొత్తం 50 మందిని ఇందులో హ‌త‌మార్చారు. ఈ ఆప‌రేష‌న్ గురించి లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్ ఆర్ ఆర్ నింబోక‌ర్ వివ‌రిస్తూ ....సర్జికల్ దాడికి వెళ్లిన భారతీయ జవాన్లు తమ వెంట చిరుత మూత్రాన్ని కూడా తీసుకువెళ్లారని పేర్కొన్నారు. కుక్కలు అరవకుండా ఉండేందుకు చిరుత మూత్రాన్ని సైనికులు తమ వెంట తీసుకువెళ్లినట్లు ఆ ఆఫీసర్ చెప్పారు. సాధారణంగా రాత్రి పూట ఊళ్లల్లో కుక్కలు మొరుగుతుంటాయని - కానీ అవి చిరుతలంటే భయపడుతాయని - అందుకే అవి అరవకుండా ఉండేందుకు సైనికులు తమ వెంట చిరుత మూత్రాన్ని తీసుకువెళ్లారని, ఆ మూత్ర వాసన వల్ల కుక్కలు బెదురుతాయని, అవి ముందుకు రావు అని ఆయన వివ‌రించారు.
Tags:    

Similar News