ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల వేడి రాజుకుంది. త్వరలో జగనున్న ఈ బై ఎలక్షన్‌ను ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతి పోరు రెండు మిత్రపక్షాలైన పార్టీల మధ్య చిచ్చుపెట్టాలా కనిపిస్తుంది. ఆ మిత్రపక్షాల్లో ఒకటి బీజేపీ కాగా , మరొకటి జనసేన. తిరుపతి బరిలో నిలిచేది మేమంటే మేము అంటూ ఇరు పార్టీల నేతలు ప్రచారాలు చేస్తూ హిట్ పెంచుతున్నారు. తిరుపతి ఎన్నికల్లో పోటీలో నిలిచేది జనసేనే అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ నేతలకు సమాచారం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది.
లోక్ సభ ఉపఎన్నికల కోసం పవన్ నియమించిన సమన్వయ కమిటి తన పర్యటనను పూర్తి చేసిందట. తర్వాత సభ్యులంతా కలిసి తయారు చేసిన నివేదికను పవన్ కు అందించారని ప్రచారం జరుగుతుంది. ఆ నివేదికలోని అంశాలను పరిశీలించిన తర్వాత ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి కంటే జనసేన అభ్యర్ధి పోటీ చేస్తేనే మంచిదనే నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. ఈ కారణంతోనే ఉపఎన్నికల్లో మన పార్టీ అభ్యర్ధే పోటీ చేస్తారని పార్టీలోని ముఖ్యనేతలకు పవన్ నుండి సమాచారం వస్తుందట.
ఇదే సందర్భంలో తిరుపతి బరిలో బీజేపీనే పోటీ చేస్తుందని , ఏపీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన ప్రకటన ఏకపక్షమని జనసేన నేతలు అంటున్నారు. తిరుపతి లో ఎవరు పోటీలో నిలవాలో చెప్పాల్సింది సోము వీర్రాజు కాదు అని , బీజేపీ అధిష్టానం అంటూ జనసేన కీలక నేత కిరణ్ రాయల్ ప్రకటించటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మొన్నటి లోక్ సభ ఎన్నికలో బీజేపీకి నోటాకన్నా తక్కువ ఓట్లు పోలైన విషయాన్ని కూడా కిరణ్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. దీన్ని బట్టి చూస్తే .. మొత్తంగా తిరుపతి బై పోల్ మిత్రపక్షాల మధ్య అగ్గి రాజేసే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు చర్చించుకుంటున్నారు. తిరుపతి ఉపఎన్నిక విషయంలో రెండుపార్టీలతో ఓ కమిటిని వేస్తామని స్వయంగా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాయే చెప్పిన విషయాన్ని జనసేన నేతలు గుర్తుచేస్తున్నారు. ఓవైపు నడ్డా ప్రకటన చేసిన కొద్దిరోజులకే బీజేపీనే పోటీ చేస్తుందని వీర్రాజు ప్రకటించటాన్ని రెండుపార్టీల్లోని నేతలు ఒప్పుకోవడంలేదు. ఇప్పటికే టీడీపీ , వైసీపీ అభ్యర్థుల విషయంలో ఓ క్లారిటీ రాగా , బీజేపీ, జనసేన నుండి ఏ పార్టీ ఎన్నికల బరిలో నిలుస్తుందో తెలియాలి అంటే ఓ స్పష్టమైన ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే.