గణపతి నవరాత్రులు అంటే.. ఒక పద్ధతి, సంప్రదాయం, భక్తి వంటివి ఉంటాయి. మద్యం, మాంసానికి.. దూరంగా ఉంటారు. ఎవరినీ తాగనివ్వరు.. తాగిన వారిని.. మండపాల వద్దకు రానివ్వరు. ఇది ఇప్పటి వరకు కొనసాగుతున్న సంప్రదాయ విధానం. అయితే ఈ దఫా.. కరోనా నేపథ్యంలో రెండేళ్ల తర్వాత.. నిర్వహించుకుంటున్న గణపతి ఉత్సవాల్లో.. అన్ని లక్ష్మణ రేఖలను తోసిపుచ్చారని, ఎలాంటి అడ్డు అదుపు లేకుండా.. వ్యవహరించారనే విమర్శలు వస్తున్నాయి.
సాధారణంగా మద్యం అంటే సీసాల్లో ఉంటుంది. పంపిణీ చేయాలనుకున్న వారు బాటిళ్లను పంచిపెడతారు. లేదా గ్లాసుల్లో పోసి ఇస్తుంటారు. ఇక్కడ మాత్రం వెరైటీగా డ్రమ్ముల్లో పోసి, మద్యానికి పంప్ వదిలారు. ఏకంగా వినాయక నిమజ్జనంలో మద్యం ఏరులై పారింది. తాగండి, ఊగండి.. అన్నట్లుగా విచ్చలవిడిగా మద్యం పంపిణీ చేశారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమంలో వైరల్ కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
గుంటూరు జిల్లా తాడేపల్లిలో జరిగిన వినాయక నిమజ్జనంలో... మద్యం ఏరులై పారింది. డ్రమ్ములో మద్యాన్ని నింపి.. నిమజ్జన ఉత్సవాలకి వచ్చిన వారికి ప్రసాదం పంచినట్లుగా పంపిణీ చేశారు.
క్యూ కట్టి మరీ మందుబాబులు పెద్ద ఎత్తున బారులు తీరారు. బహిరంగ మద్యాన్ని అరికట్టాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. దీనికి పక్కనే గానా భజనా కూడా ఉండటంతో.. ఆహుతులు భారీగా హాజరైయ్యారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమంలో చెక్కర్లు కొట్టడం.. అధికార పార్టీ నేతలు, పోలీసులు అప్రమత్తమయ్యారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.