''మద్యం తాగి బండి నడపొద్దు.. మరి, మద్యం అమ్మి ప్రభుత్వం నడపొచ్చా?'' అనే సెటైర్లు వినిపిస్తుంటాయి. ఇది కామెడీగానే అనిపించినా.. వాస్తవమే. దేశంలోని దాదాపు ప్రతీరాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా మారిపోయింది మద్యం అమ్మకం. అందుకే.. సాధ్యమైనంత ఎక్కువ లిక్కర్ జనాల గొంతుల్లో పోసి.. వీలైనన్ని ఎక్కువ సొమ్ములు జనాల నుంచి పిండుకోవాలని చూస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ విధానాన్ని ప్రకటించింది. ఇప్పటి వరకు అర్ధరాత్రి 12 గంటలు దాటితే అన్నీ బంద్ చేయాల్సిందే. కానీ.. కొత్త నిబంధనల ప్రకారం.. ఏకంగా ఉదయం 3 గంటల వరకు తెరిచే ఉంటాయి. రాష్ట్రంలోని బార్లు, క్లబ్బులు, రెస్టారెంట్లన్నీ ఓపెన్ చేసే ఉంచాలని సర్కారు నిర్ణయించింది.
ఇక, మద్యం తాగే వారికి వయసును కూడా ప్రభుత్వం కుదించింది. ఇప్పటి వరకు చట్టపరంగా 25 సంవత్సరాలకు పైబడిన వారే మద్యం సేవించేందుకు అనుమతి ఉంది. ఇప్పుడు ఈ నిబంధనను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది కేజ్రీవాల్ సర్కారు. 25 సంవత్సరాల నుంచి 21 ఏళ్ల కుదించింది. ఇక, నుంచి 21 ఏళ్లలోపు వారు లీగల్ గా మద్యం కొనుగోలు చేయొచ్చు.
ఇదేవిధంగా.. మరోకీలక నిర్ణయం కూడా తీసుకుంది. ప్రభుత్వ ఆధీనంలో నడిచే మద్యం షాపులను మూసేసి.. ప్రైవేటు షాపులను ప్రోత్సహించాలని కూడా నిర్ణయం తీసుకుంది. మొత్తానికి.. సాధ్యమైనంత ఎక్కువగా మద్యాన్ని అమ్మాలని, తద్వారా భారీగా సొమ్ములు రాబట్టాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.