అమెరికా: ప్రతీ నలుగురిలో ముగ్గురు లాక్ డౌన్ లో..

Update: 2020-04-01 08:30 GMT
అమెరికాలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. వేలమందికి కరోనా సోకింది. వందలాది  మంది మరణిస్తున్నారు.  కరోనా కారణంగా అమెరికాలో పరిస్థితి దారుణంగా ఉంది. ప్రపంచంలో అత్యదిక కరోనా కేసులు నమోదైన దేశంగా అమెరికా నిలిచింది.  మంగళవారం ఏకంగా 24వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. అమెరికాలో పాజిటివ్ కేసులు 1.88 లక్షలు దాటాయి. న్యూయార్క్, న్యూజెర్సీలో తీవ్రత ఎక్కువగా ఉంది.

అమెరికా దేశంలోని 50 రాష్ట్రాలకు గాను 32 రాష్ట్రాలు పూర్తి లాక్ డన్ లో ఉన్నాయి. తాజాగా మేరిలాండ్ - వర్జీనియా - అరిజోనా - టెన్నెసీ రాష్ట్రాలు లాక్ డౌన్ ను విధించాయి. దీంతో అమెరికాలోని ప్రతి నలుగురిలో ముగ్గురు  ఏదో ఒక విధమైన  లాక్ డౌన్ లో ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి.

అమెరికాలో కరోనా కారణంగా 3వేల మందికి పైగా మరణించారు. దీంతో దేశంలోని 2.45 కోట్ల మంది ఇళ్లకే పరిమితమయ్యారు. కరోనా విలయతాండవం ముగిసినప్పటికీ దేశంలో 4.7 కోట్ల మంది నిరుద్యోగులవుతారని ఫెడరల్ రిజర్వ్ సంచలన విషయం తెలిపింది. 

కరోనా కారణంగా ఉద్యోగులు వదిలి అందరూ ఇంట్లోనే కాలం గడుపుతున్నారు. దీంతో చాలా మంది ఉద్యోగాలు ఊడిపోయాయి. పనిచేస్తే చావడం గ్యారెంటీ కావడంతో అందరూ మానేసి ఇంట్లో ఉన్నారు. కరోనా తగ్గాక నిరుద్యోగుల సంఖ్య దేశంలో చాలా పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పుగా అభివర్ణిస్తున్నారు.


Tags:    

Similar News