ట్యాపింగ్‌ ఆధారాలు బయటపెట్టే టైం రాలేదంట

Update: 2015-07-08 10:21 GMT
ఓటుకు నోటు కేసు విషయంలో తెలంగాణ ఏసీబీ అధికారులు వడివడిగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో మరోసారి తెలుగుదేశం పార్టీ నేతలు ఫోన్‌ ట్యాపింగ్‌ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. తాజాగా ఈ అంశంపై పలువురు నేతలతో పాటు.. టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు లోకేశ్‌ స్పందించారు. వాస్తవానికి మంగళవారం రాష్ట్రపతిని కలిసి టీడీపీ నేతలు.. తమకు చెందిన ఫోన్లను అక్రమంగా తెలంగాణ రాష్ట్ర సర్కారు ట్యాపింగ్‌ చేపట్టిందన్న విషయాన్ని ఫిర్యాదు చేయటం తెలిసిందే.

మరోవైపు ట్యాపింగ్‌ వ్యవహారంపై లోకేశ్‌ స్పందిస్తూ.. తెలంగాణ అధికారులు తమ ఫోన్లను ట్యాపింగ్‌కు పాల్పడ్డారని.. సజ్జన్నార్‌.. శివధర్‌రెడ్డిలు సంతకం చేసి ఇచ్చిన పత్రాలతో పాటు.. పలు ఆధారాలు తమ వద్ద ఉన్నాయని చెప్పారు. టెలికాం సర్వీసు ప్రొవైడర్లకు తమ ఫోన్లను ట్యాపింగ్‌ చేయాలంటూ ఇచ్చిన ఆధారాల్ని తాము సమయం చూసుకొని బయటపెడతామని చెప్పారు.

ఓపక్క జోరుగా అరెస్ట్‌లు సాగుతున్నా.. ఏపీ సర్కారు మాత్రం ట్యాపింగ్‌నకు సంబంధించిన ఆధారాల్ని మాత్రం బయట పెట్టేందుకు మాత్రం ఇంకా సమయం ఉందని.. సరైన సమయంలో వాటిని బయటపెడతామని చెబుతుందటం గమనార్హం.

Tags:    

Similar News