లోకేశ్ టార్గెట్ ఆ ఇద్ద‌రే !

Update: 2022-06-10 10:30 GMT
ఎన్నిక‌ల హోరు అప్పుడే మొద‌ల‌యిందా అన్న విధంగా నిన్న‌టి ప‌రిణామాలు ఉన్నాయి. వాటికి కొన‌సాగింపుగానే రేప‌టి వేళ కూడా ప‌రిణామాలు ఉండ‌నున్నాయి. త‌న‌ను అడ్డుకునేందుకు కుయుక్తులు ప‌న్నుతున్న వైసీపీకి చెక్ పెట్టేందుకు లోకేశ్ మ‌రిన్ని వ్యూహాల‌తో సిద్ధం అవుతున్నారు. వీలున్నంత వ‌ర‌కూ అధికార పార్టీ వ్యవహారాలను సోష‌ల్ మీడియా ద్వారా చెప్పేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ, ఆ ఇద్ద‌రినీ టార్గెట్ చేసేందుకు స‌న్న‌ద్ధం అవుతున్నారు.

ప్ర‌జా క్షేత్రంలో తాము మంచి చేయాల‌ని అనుకుంటున్నా అడ్డుకుంటూ, అన్నా క్యాంటీన్ల  కూల్చివేత‌ల‌కు సిద్ధం అవుతున్న తీరుపై కూడా లోకేశ్ ఆగ్రహంతో ఊగిపోతు న్నారు. ఎలా అయినా ఆ ఇద్ద‌రినీ నిలువ‌రించేందుకే తాను ప‌నిచేయ‌నున్నాన‌ని అంటున్నారు.

ఏ విధంగా చూసుకున్నా..ఎలా మ‌న‌సుకు స‌ర్ది చెప్పుకున్నా.. ఒక‌ప్పుడు ఆ ఇద్ద‌రూ టీడీపీ గూటి నుంచే ఎదిగి వ‌చ్చారు. వారే కొడాలి నాని, వ‌ల్ల‌భ‌నేని వంశీ. ఇప్పుడు మాత్రం చిన‌బాబు లోకేశ్ - ను టార్గెట్ గా చేసుకుని మాట్లాడుతూ, అదుపు దాటి ప్ర‌వ‌ర్తిస్తూ త‌రుచూ వివాదాలు రేపుతున్నారు. ఇప్పుడివే పెను వివాదాల‌కు తావిస్తున్నాయి. నిన్న‌టి జూమ్ స‌మావేశం త‌రువాత ఆ ఇద్ద‌రూ మాట్లాడిన తీరుపై కూడా టీడీపీ మండిప‌డుతోంది.

తాము నిర్వ‌హించాల‌నుకున్న స‌మావేశానికి ఆ ఇద్ద‌రితో పాటు ఇంకొంద‌రు వైసీపీ లీడ‌ర్స్ కూడా దొంగ ఐడీల‌తో వ‌చ్చార‌ని, ఇది పూర్తిగా అనైతికం అని మండిప‌డుతున్నారు. వీలున్న‌త వ‌ర‌కూ అధికార పార్టీ ఆగ‌డాల‌ను తిప్పి కొట్టేందుకు తాము ఎన్న‌డూ సిద్ధంగానే ఉన్నామ‌ని లోకేశ్ అంటున్నారు. తన‌కు సల‌హాలూ, సూచ‌నలూ ఇవ్వ‌డం కాదు కానీ ముందు మీ అసమ‌ర్థ ప్ర‌భుత్వాన్ని దార్లోకి తెచ్చుకోండి అని లోకేశ్ చెబుతున్నారు.

వాస్త‌వానికి ప‌దో త‌ర‌గ‌తి త‌ప్పిన విద్యార్థుల‌తో లోకేశ్ మాట్లాడుతుండ‌గా వ‌చ్చిన నాయ‌కులకు అనైతిక‌త త‌ప్ప ఏం లేద‌ని టీడీపీ మండిప‌డుతోంది. ఇక‌పై కూడా తాము ఇలానే చేస్తామ‌న్న సంకేతాలు వైసీపీ ఇస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగానే ఉన్నామ‌ని టీడీపీ చెబుతోంది. వీలున్నంత వ‌ర‌కూ అధికారం ఉన్నంత వ‌ర‌కూ ప్ర‌జల‌కు మేలు చేసే ప‌నుల‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌ని, తాము చెప్పాల‌న‌కున్న మాట‌ల‌ను, చేయాల‌నుకున్న ప‌నుల‌ను అడ్డుకుంటే ఆ విధంగా పార్టీకి వ‌చ్చే న‌ష్టం అంటూ ఏమీ ఉండ‌దు అని కానీ త‌మ‌కు రెండింత‌లు మైలేజీ పెరుగుతుంద‌ని అంటున్నారు టీడీపీ నాయ‌కులు.

ఇక నిన్న‌టి వేళ మంగ‌ళ‌గిరి అన్నా క్యాంటీన్ కూల్చివేత‌ను మొన్న‌టి వేళ కుప్పం అన్నా క్యాంటీన్ ఏర్పాటును అడ్డుకున్న పోలీసుల వైఖ‌రిపైనా టీడీపీ నిర‌స‌న గ‌ళం వినిపించ‌నుంది. ఎవ్వ‌రు అడ్డు వ‌చ్చినా సరే అన్నా క్యాంటీన్లు అన్న‌వి ఆగ‌వ‌నే అంటోంది. వీటిపై కూడా చిన‌బాబు క్షేత్ర స్థాయిలో ఉండి పోరాడ‌నున్నారు. వీలున్నంత వ‌ర‌కూ సామర‌స్య పూర్వ‌క ధోర‌ణిలోనే చెప్పి చూస్తామ‌ని, విన‌కుంటే తాము కూడా వ్య‌వ‌స్థ‌పై, వ్య‌వ‌స్థ‌ను న‌డుపుతున్న పోలీసుల‌పై తిరుగుబాటుకు సిద్ధ‌మేన‌ని ప‌లు మార్లు లోకేశ్ అంటున్నారు.
Tags:    

Similar News