తంబ‌ళ్ల‌ప‌ల్లె రా! తేల్చుకుందాం: లోకేష్ వ‌ర్సెస్ మిథున్‌రెడ్డి!!

Update: 2023-03-11 13:07 GMT
చిత్తూరు జిల్లాలో సాగుతున్న టీడీపీ యువ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ 'యువ‌గ‌ళం' పాద‌యాత్ర పొలిటిక‌ల్ హీట్ పెంచేసింది. చిత్తూరు జిల్లాలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు.. నిద్ర‌పోతున్నార‌ని.. అందు కే ఇక్క‌డ ఎలాంటి అభివృద్ధి లేకుండా పోయిందని నారాలోకేష్ విమ‌ర్శించారు. ప్ర‌ధానంగా ఎంపీ మిథున్ రెడ్డిని టార్గెట్ చేశారు. ఆఫ్రికాలో ఉన్న వ్యాపారాల‌ను చూసుకునేందుకే మిథున్‌రెడ్డికి స‌మ‌యం స‌రిపోవడం లేద‌న్నారు.

చిత్తూరు జిల్లా పై చ‌ర్చ‌కు రావాల‌ని.. తాము సిద్ధ‌మ‌ని నారా లోకేష్ స‌వాల్ విసిరారు. "దమ్ముంటే చిత్తూరు అభివృద్ధిపై చ‌ర్చించేందుకు తంబళ్ల‌పల్లెకు రా!" అని ఎంపీ మిధున్ రెడ్డికి నారా లోకేష్  స‌వాల్ రువ్వారు. ఈ స‌వాల్‌పై మిథున్ రెడ్డి కూడా అదే రేంజ్‌లో రియాక్ట్ అయ్యారు.  ఈ నెల 12న తంబళ్ల‌పల్లెలో నే ఉంటానని ప్లేస్ ఎక్కడో చెప్పాలని లోకేష్‌కు కౌంటర్ ఇచ్చారు.

అంతేకాదు.. నారా లోకేష్‌లో ప్రవహించేది చిత్తూరు జిల్లా రక్తం అయితే జిల్లాలో ఏ సీటు నుంచి అయినా ఫోటీ చేసి త‌న‌ మీద గెలవాలని మిథున్‌రెడ్డి మ‌రో స‌వాల్ విసిరారు. చిత్తూరు జిల్లా డీఎన్ఏ నీ రక్తంలో ఉంటే.. నా మీద పోటీ చేయ్ రా.. అని వ్యాఖ్యానించారు.. చర్చకైనా సిద్ధమే.. పోటీకి అయినా సిద్ధమేన‌న్న మిథన్‌రెడ్డి.. "నువ్వు ఎక్కడకు రమ్మంటావో చెప్పు" అని ప్ర‌శ్నించారు.

దీంతో ఇద్దరు నేతల సవాళ్ళు.. ప్రతి సవాళ్ళ తో ఇరుపార్టీల్లో తీవ్ర ఉత్కంఠ నెల‌కొంది. ప్ర‌స్తుతం మ‌ద‌న‌ప‌ల్లె నియోజ‌క‌వ‌ర్గంలో సాగుతున్న యువ‌గ‌ళం పాద‌యాత్ర ఇక్క‌డ ముగించుకుని తంబ‌ళ్ల‌ప‌ల్లె నియోజ‌క‌వ‌ర్గానికి చేర‌నుంది. అయితే.. అటు ఎంపీ.. ఇటు టీడీపీ యువ నాయ‌కుడి స‌వాళ్ల నేప‌థ్యంలో ఈ నియోజ‌క‌వ‌ర్గంలో పాద‌యాత్ర అంత తేలికగా అయితేజ‌రిగే ప‌రిస్థితి లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News