భార్యపై అనుమానం.. చంపేసి డయల్ 100కు ఫోన్ చేశాడు

వీడ్నేం అనాలి? అనుమానం భూతంతో భార్యను సందేహించటమే కాదు ఆమెను చంపేసి డయల్ 100కు ఫోన్ చేసిన షాకింగ్ ఉదంతం హైదరాబాద్ లో చోటు చేసుకుంది.

Update: 2025-02-12 04:50 GMT

వీడ్నేం అనాలి? అనుమానం భూతంతో భార్యను సందేహించటమే కాదు ఆమెను చంపేసి డయల్ 100కు ఫోన్ చేసిన షాకింగ్ ఉదంతం హైదరాబాద్ లో చోటు చేసుకుంది. కూకట్ పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఉదంతం వివరాల్ని చూస్తే.. 22 ఏళ్ల మహ్మద్ నస్రీన్ కు అబ్దుల్ రహీంకు ఐదేళ్ల క్రితం పెళ్లైంది. నస్రీన్ ఇంట్లోనే ఉండగా.. భర్త మాత్రం ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో వార్డు బాయ్ గా పని చేస్తుంటాడు. వీరికి ఇద్దరు పిల్లలు.

ప్రస్తుతం హబీబ్ నగర్ లోని ఒక అద్దె ఇంట్లో ఉండేవారు. కొంతకాలంగా భార్యపై అనుమానం పెంచుకున్న అతడు.. ఆమెను ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. దీంతో వీరిద్దరి మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటూ ఉండేవి. ఈ నేపథ్యంలో పిల్లల్ని నస్రీన్ తన తల్లిదండ్రుల వద్దకు పంపేసింది. ఇద్దరు ఇల్లు మారాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో కూకట్ పల్లి ప్రశాంత్ నగర్ పరిధిలోని రాజీవ్ గాంధీనగర్ లోని ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నారు.

ఇంటికి అడ్వాన్సుగా రూ.500 చెల్లించి.. మంగళవారం ఉదయం ఇంటిని క్లీన్ చేసుకోవటానికి ఇద్దరు అక్కడకు వెళ్లారు.ఈ క్రమంలో వారిద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. దీంతో ఆవేశానికి గురైన అతను బండరాయితో భార్య తల మీద మోది చంపేశాడు. అనంతరం అదే విషయాన్ని డయల్ 100కు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లగా.. అప్పటికే అతడు నడుచుకుంటూ బాలానగర్ పోలీసుస్టేషన్ కు వెళ్లి లొంగిపోవటం గమనార్హం. అయితే.. హత్యానేరం కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోకి రావటంతో.. నిందితుడ్ని కూకట్ పల్లి పోలీసులకు అప్పజెప్పారు.

Tags:    

Similar News