ట్రంప్ కూతురుతో మామూలుగా ఉండదిక.. వైరల్ వీడియో
ఇటీవల మియామీలోని ఓ వ్యాయామశాలలో ఇవాంక ట్రంప్ జుజుత్సూ నైపుణ్యాలను ప్రదర్శించారు. బ్లూ బెల్ట్ ధరించిన ఆమె తన ప్రత్యర్థులను క్షణాల్లో మట్టి కరిపించారు.;
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్ (43) మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి ఆమె రాజకీయాల ద్వారా కాకుండా తన అద్భుతమైన మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాలతో అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రాచీన సంప్రదాయ మార్షల్ ఆర్ట్ అయిన జియూ-జిత్సూ (జుజుత్సూ)లో ఆమె సాధించిన ప్రావీణ్యం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
ఇటీవల మియామీలోని ఓ వ్యాయామశాలలో ఇవాంక ట్రంప్ జుజుత్సూ నైపుణ్యాలను ప్రదర్శించారు. బ్లూ బెల్ట్ ధరించిన ఆమె తన ప్రత్యర్థులను క్షణాల్లో మట్టి కరిపించారు. ఆమె కనబరిచిన హస్త లాఘవం, వేగం అందరినీ ఇంప్రెస్ చేశాయి. ఇవాంక ట్రంప్ జుజుత్సూలో ఎంతటి బలం, క్రమశిక్షణ కలిగి ఉన్నారో ఈ వీడియో స్పష్టం చేస్తోంది.
జుజుత్సూలో బ్లూ బెల్ట్ సాధించడం అంత సులువైన విషయం కాదు. దీని కోసం ఎంతో సాధన, అంకితభావం ఉండాలి. ఇవాంక ట్రంప్ నిత్యం ఈ మార్షల్ ఆర్ట్‌ను సాధన చేస్తారని తెలుస్తోంది. ఆమె శిక్షణ పొందుతున్న వీడియోను చూసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఇవాంక ట్రంప్ ఆయనకు సీనియర్ సలహాదారుగా సేవలందించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆమె రాజకీయాలకు దూరంగా ఉంటూ తన కుటుంబ బాధ్యతలకు, వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. తనకు లభించిన సమయాన్ని ఇలాంటి ఆసక్తికరమైన విషయాలపై వెచ్చిస్తూ తన నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటున్నారు.
ఒకప్పుడు రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన ఇవాంక, ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ లోనూ తన ప్రతిభను చాటుకుంటున్నారు.