పార్లమెంటులో 'అరకు' ఘుమఘుమలు.. రేపటి నుంచే!
తాజాగా ఆదివారం ఉదయం లోక్ సభ స్పీకర్.. ఓం బిర్లా.. పార్లమెంటులో అరకు కాఫీ స్టాల్స్‌ను ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇచ్చారు.;
అరకు కాఫీకి అంతర్జాతీయ గుర్తింపును తీసుకురావాలని తపిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు కృషి ఫలిం చింది. అరకు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని గిరిజనులు.. ఒకప్పుడు గంజాయి సహా.. ఇతర నిషేధిత పంటలు పండించేవారు. వారిని ఆ మార్గం నుంచి తప్పించి వాణిజ్య పంటలైన పసుకు, కుంకు మ పువ్వు, కాఫీ పండించే దిశగా చంద్రబాబు 2014-19 మధ్య ప్రోత్సహించారు. వైసీపీ హయాంలోనూ.. వారికి ఇవే ప్రోత్సాహకాలు అందాయి.
ఫలితంగా ఇప్పుడు అరకు అంటేనే `కాఫీ` అనే పేరు వచ్చేలా చేసింది. కేవలం గిరిజనులను కాఫీ పండిం చే దిశగానే ప్రోత్సహించడం కాకుండా.. కాఫీకి మార్కెటింగ్ చేసే బాధ్యతను కూడా.. ప్రస్తుత కూటమి ప్రభు త్వం తీసుకుంది. దీంతో ప్రభుత్వం తరఫున అతిథులకు.. గిఫ్ట్ ప్యాక్‌గా కూడా అరకు కాఫీ ఉత్పత్తులను మూడు రకాలుగా అందిస్తున్నారు. ఒకటి అరకు కాఫీ గింజలను నేరుగా ఇవ్వడం, 2) ఇన్ స్టంట్ కాఫీ పౌడర్. 3) చెకోరీతో కూడిన ఫిల్టర్ కాఫీ పౌడర్‌ను అందించడం.
ఈ మూడు కూడా.. ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా దీనిని ప్రొజెక్టు చేసేందుకు కీల కమైన మార్గం పార్లమెంటేనని గుర్తించిన ప్రభుత్వం.. ఆ దిశగా కూడా ప్రయత్నాలు చేసింది. గత నెలలో నే పార్లమెంటు సభ్యులకు గిఫ్ట్ ప్యాక్‌గా అరకు ఇన్‌స్టెంట్ కాఫీని అందించింది. ఇదే సమయంలో పార్లమెంటులో కూడా అరకు కాఫీని అప్పటికప్పుడు తాగేందుకు వీలుగా.. స్టాల్స్ ఏర్పాటు చేయాలని భావించిన సీఎం చంద్రబాబు.. ఇటీవల పర్యటనలో దీనికి కూడా ఆమోదం పొందారు.
తాజాగా ఆదివారం ఉదయం లోక్ సభ స్పీకర్.. ఓం బిర్లా.. పార్లమెంటులో అరకు కాఫీ స్టాల్స్‌ను ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇచ్చారు. దీంతో పార్లమెంటు గేట్లు.. 1, 2 లలో సోమవారం నుంచిరెండు స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు. ఈ ఏర్పాట్లను పరిశీలించేందుకు రాష్ట్ర మంత్రి సంధ్యారాణి ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రస్తుతం పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్ననేపథ్యంలో కాఫీ స్టాల్స్‌ను ఆమె స్వయంగా ప్రారంభించి.. పార్లమెంటు సభ్యులకు విక్రయించనున్నారు. కప్పు కాఫీని రూ.20 గా ప్రాధమికంగా నిర్ధారించారు. ఈ స్టాల్స్ ప్రస్తుత పార్లమెంటు సమావేశాలకు మాత్రమే పరిమితం చేసినా.. భవిష్యత్తులోనూ కొనసాగించేలా అనుమతులు సాధించాలని సీఎం చంద్రబాబు సూచించారు.