``రాముడు లేడు.. రావణుడు లేడు.. అదో నాటకం మాత్రమే!``- అంటూ.. సంచలన వ్యాఖ్యలు చేయడంతో పాటు.. దైవాన్ని నమ్మని ఏకైక నాయకుడిగా.. తమిళనాడు రాజకీయాల్లో తనకంటూ.. ప్రత్యేకతను సాధించుకున్నారు.. నాస్తిక వాది.. రాజకీయ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత కరుణానిధి. ఆయన జీవించినన్నాళ్లు.. ఏనాడూ దేవుడి మాట ఎత్తలేదు. ఎవరికీ ఎలాంటి హామీలూ ఇవ్వలేదు. జయలలితకు, తనకు మధ్య ఎంత పోరు సాగినా.. జయ హిందువులను టార్గెట్ చేసుకుని ఎన్ని పథకాలు పెట్టినా.. ఏనాడూ కరుణానిధి నాస్తికం అనే లైన్‌ను దాటింది లేదు. ఎప్పుడూ హిందువుల ఓటు బ్యాంకును తనకు అనుకూలంగా మార్చుకున్నదీ లేదు.
కానీ, ఇప్పుడు మారిన రాజకీయాలకు అనుగుణంగా.. కరుణ కుమారుడు, డీఎంకే అధినేత స్టాలిన్ తన పంథాను మార్చుకున్నారు. పార్టీని హిందువులకు చేరువ చేసేందుకు ఆయన ఉబలాటపడుతున్నారు. ఈ క్ర మంలోనే ఆయన తన మేనిఫెస్టోలో హిందువులను చేరువ చేసుకునేందుకు ఇబ్బడి ముబ్బడిగా హామీలు గుప్పించారు. దీంతో డీఎంకే ఇన్నాళ్లుగా జపించిన నాస్తిక వాద జపం ఎటు పోయిందనే వాదన వినిపిస్తుండడం గమనార్హం. తాజాగా స్టాలిన్ విడుదల చేసిన మేనిఫెస్టోలో.. హిందూ వర్గాన్ని ఆకర్షించే అనేక హామీలు గుప్పించారు.
కాశీ, కేదార్‌నాధ్, బదరీనాథ్, పురి, గోకర్ణం, తిరుపతి, రామేశ్వరం, మథుర సహా దేశంలోని ఏ ప్రముఖ ఆలయానికి వెళ్లేందుకైనా రూ 25,000 నుంచి లక్ష రూపాయల సాయం. పతనావస్థలో ఉన్న, మరమ్మతులు అవసరమైన కోవెళ్లకు - ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ఆలయాలకు రూ 1000 కోట్లు కేటాయింపు. తిరుత్తణి, శోలింగార్, తిరునీర్‌మలై, తిరుచ్చి, మలైకొట్టై, తిరుచెంగాడ్ ఆలయాల్లో కేబుల్ కార్ సౌకర్యం. తిరువణ్ణామలై(అరుణాచలం)లో గిరిప్రదక్షిణం చే సే మార్గం వెంబడి హరిత వనం ఏర్పాటు. ఆ 16 కిలోమీటర్ల పరిధిలోని ఆలయాలకు కొత్త సొబగులు. వళ్లలార్ భక్తులకు వడలూర్‌లో కేంద్రం ఏర్పాటుపై ఆయన హామీ ఇచ్చారు.
ఏదేమైనా స్టాలిన్ ప్రస్తుత ఎన్నికల్లో అధికారంలోకి వస్తారన్న అంచనాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో స్టాలిన్ సంప్రదాయ ఓటు బ్యాంకు రాజకీయాలకు భిన్నంగా హిందువులను ఆకట్టుకుంటోన్న పరిస్థితి ఉంది. అయితే ఈ విషయంలో ఆయన తన తండ్రి రాజకీయ పంథాకు భిన్నంగా వెళుతుండడమే అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.