అమెరికాలో గన్ సంస్కృతి ఎంత విచ్చలవిడిగా మారిపోయిందో ఇటీవలి ఘటనలు సాక్ష్యాలతో నిరూపిస్తున్నాయి. కాస్త పెద్దగా ఏ కారణం కనిపించినా.. ఎదుటి వారిని చంపడమే పరిష్కారంగా ఫిక్స్ అయిపోతున్నారు అక్కడి జనం. అన్యాయంగా తుపాకీ పట్టి.. పిట్టల్లా కాల్చి చంపేస్తున్నారు. గడిచిన మూడు నెలల్లోనే సుమారు మూడ్నాలుగు ఘటనల్లో తుపాకీ పేలగా.. దాదాపు 24 మంది వరకు చనిపోయారు. తాజాగా మరోసారి జరిగిన ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.
ఈ నెల 9న కొలరాడో ప్రాంతానికి చెందిన సాండ్రా అనే యువతి పుట్టిన రోజు వేడుకలు జరిపారు కుటుంబ సభ్యులు. ఈ వేడుకలకు బంధుమిత్రులు హాజరయ్యారు. వీరితోపాటు తన ప్రియుడు మాకియాస్ ను కూడా ఆహ్వానించింది సాండ్రా. అయితే.. పార్టీకి హాజరైన మాకియాస్.. వెంట తెచ్చుకున్న తుపాకీతో మొత్తం ఆరుగురిని కాల్చి చంపేశాడు!
ఈ దుర్ఘటనలో సాండ్రాతోపాటు మెల్విన్ పెరెజ్(30) , పెరెజ్(33) , జోస్ గుటిరెజ్(21) , జోస్ ఇబ్రారా (26) జోనా క్రజ్ ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
ఈ దారుణానికి కారణమేంటని ఆరాతీస్తే.. ప్రియురాలు సాండ్రపై ఉన్న కోపమేనని తేలిందని పోలీసులు తెలిపారు. వీళ్లిద్దరూ ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే.. ఈ మధ్య మనస్పర్థలు వచ్చాయట. ఇలాంటి పరిస్థితులత్లో సాండ్ర అతన్ని బర్త్ డే వేడుకలకు ఆహ్వానించింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదుగానీ.. వెంట తెచ్చుకున్న తుపాకీతో కనిపించిన వారినల్లా కాల్చి పడేశాడట.