బడా సంస్థల్లో ఉద్యోగాల కత్తెర కొనసాగుతోంది. తాజాగా అతిపెద్ద ఇంజనీరింగ్ సంస్థ లార్సన్ అండ్ టుబ్రో తన సంస్థలోపనిచేస్తున్న 14 వేల మందికి పొగపెట్టేందుకు సిద్ధమైంది. కార్యాలయాల డిజిటలైటేజషన్... వ్యాపారం తగ్గడం వంటి కారణాలు చూపుతూ భారీగా మేన్ పవర్ రిడక్షన్ కు ఎల్ అండ్ టీ రెడీ అయింది. మొత్తం ఉద్యోగుల్లో 11.2 శాతం మందిని తగ్గించుకుంటోంది. లక్ష మందికి పైగా ఉద్యోగులున్న సంస్థలో దాదాపు 14 వేల మందిని తొలగించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు ఎల్ అండ్ టీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఆర్ శంకర్ రామన్ వెల్లడించారు. సంస్థలో మొత్తం 1.2 లక్షలమంది ఉద్యోగులు ఉండగా ఈ ఆర్థిక సంవత్సరానికి గాను 14 వేలమందిని తొలగించినట్టు రామన్ చెప్పడంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ మరో విడత ఉద్యోగుల తొలగింపు కార్యక్రమం ఉంటుందని భావిస్తున్నారు.
ఉద్యోగుల తొలగింపుపై ఆ సంస్థ ఆర్థిక పరిస్థితినే కారణంగా చూపించింది. నష్టాల్లో ఉన్నందున సంస్థను గాడిలో పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని చెబుతున్నారు. మొత్తంగా వివిధ వ్యాపారాల్లో ఈ తొలగింపును చేపట్టిబోతున్నారు. చమురు ధరల పతనం వల్ల విదేశాల్లోనూ తమ వ్యాపారం భారీగా దెబ్బతిందని.. రానున్న నెలల్లో కూడా ఆర్థిక పరిస్థితి గడ్డుగానే ఉండనుందని ఎల్ అండ్ టీ అంచనా వేస్తోంది. దేశీయ మార్కెట్ లో పోటీ తీవ్రంగా ఉండడంతో వెంటనే ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నంలో ఉద్యోగాలకు కత్తెర వేసింది.
కాగా, 14 వేలమందిని ఒకేసారి తొలగిస్తుండడంతో మిగతావారూ ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో సంస్థ వారికి కొంత భరోసా ఇస్తూ కోత దిద్దుబాటు చర్యల్లో భాగం తప్ప సీక్వెన్షియల్ తగ్గింపు కాదని చెబుతోంది. కాగా ఇటీవలి కాలంలో ఇదే అతిపెద్ద ఉద్యోగాల తొలగింపు అని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. అయితే గతేడాదితో పోల్చితే ఈ ఏడాది ఫలితాలు మెరుగైనా కూడా ఉద్యోగులపై వేటు వేయడం సందేహాలకు దారితీస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/