కేసీఆర్‌ ను మెచ్చి పార్టీని తిట్టిన కాంగ్రెస్ సీనియ‌ర్‌

Update: 2015-11-13 09:33 GMT
కాంగ్రెస్ పార్టీ రాజ‌కీయాలే భిన్నంగా ఉంటాయి. ఎవ‌రు ఎవ‌రిని ఎందుకు అభిమానిస్తారో తెలియ‌దు. ఎందుకు వ్య‌తిరేకిస్తారో అంత‌కంటే అర్థం కాదు. పైగా వారి అభిమానం - వ్య‌తిరేక‌త ఏకకాలంలో ఉంటాయి. ఇదంతా ఎవ‌రిగురించి కాంగ్రెస్‌కు చెందిన ఓ సీనియ‌ర్ గురించి. పీసీసీ అధ్య‌క్షుడిగా - మంత్రిగా వ్య‌వ‌హ‌రించి ఓ వెలుగు వెలిగిన‌ ఎం.స‌త్య‌నారాయ‌ణ రావు అలియ‌స్ ఎంఎస్ ఆర్‌.

నిజాయితీగా మాట్లాడడానికి, ముక్కుసూటిత‌నానికి ఎంఎస్ ఆర్ పెట్టిందిపేరు. చాలా కాలం త‌ర్వాత తెర‌మీద‌కు వ‌చ్చిన ఎంఎస్ ఆర్ హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ మంచి పనులే చేస్తున్నారని కితాబిచ్చారు. మిషన్ కాకతీయ - గ్రామజ్యోతి లాంటి పథకాలతో అందరికి లాభమేన‌ని చెప్పారు. కేసీఆర్ అందరిని కలుపుకుని పోవాలి అంటూ ఇదే క్ర‌మంలో ఓ సూచ‌న కూడా చేశారు. అంత‌టితో ఆగ‌కుండా కేసీఆర్ మంచి చేయకపోతే న‌రేంద్ర‌మోడీకి బీహార్ లో పట్టిన గతే  పడుతుందని హెచ్చ‌రించారు.

ఇక సొంత పార్టీ విష‌యానికి వ‌స్తే....ప్రతిపక్షాలుగా విమర్శించాలి కనుక కాంగ్రెస్ పార్టీ టీఆర్ ఎస్‌ ను విమర్శిస్తుందని చెప్పారు. వరంగ‌ల్ ఉప ఎన్నిక విష‌యాన్ని ప్ర‌స్తావించ‌గా...ఎవ‌రు గెలుస్తారనే దానిపై స్పందించ‌నంటూ జ‌వాబు దాట‌వేశారు. అయితే వ‌రంగల్ ఎన్నికల్లో ఎవరికీ ఓటేయాలో ప్రజలే నిర్ణయించుకుంటారని చెప్పారు.
Tags:    

Similar News