ఎన్నో ఏళ్ల వాళ్ల కల తీరుస్తున్న జగన్

Update: 2020-01-03 09:38 GMT
ఏపీలో సుధీర్ఘమైన సముద్రతీరం ఉంది. కానీ దాన్ని వాడుకునే తెలివితేటలే ఇన్నేళ్లు పాలించిన నేతలకు లేకుండా పోయాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. విశాఖ, కాకినాడ, కృష్ణపట్నం లాంటివి తప్పితే మరో ఫిషింగ్ హార్బర్ ను , పెద్ద పోర్టుల నిర్మాణాన్నే చేపట్టలేకపోయాయి. ఇప్పుడు దుస్థితిని తీర్చడానికి వైఎస్ జగన్ రెడీ అయ్యింది.

బందరు ఫిషింగ్ హార్బర్ అభివృద్ధి కి వైఎస్ జగన్ సర్కారు నడుం బిగించింది. అమరావతి-విజయవాడకు దగ్గరలోని దీన్ని అభివృద్ధి చేసేందుకు సిద్ధమైంది. ఏకంగా 280 కోట్లతో ప్రాథమికంగా డీపీఆర్ సిద్ధం చేయిస్తోంది.

బందరు సముద్ర ముఖం ద్వారా వద్ద తరచూ ఇసుక మేటలు వేస్తుండడం తో అన్ని వేళల్లో మర పడవలు వేటకు వెళ్లలేక మత్స్యకారులు, వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. సముద్ర పోటు వచ్చినప్పుడు మాత్రమే మర పడవలు తీయాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. దీంతో ఇక్కడ ఫిషింగ్ హార్బర్ కట్టేందుకు జగన్ సర్కారు రెడీ అయ్యింది.

బందరులో ఫిషింగ్ హార్బర్ లేక పోవడం తో కాకినాడ, విశాఖపట్నం, కృష్ణపట్నం హార్బర్లకు మర పడవలు తరలిపోతున్నాయి. అందుకే బందరు ఎమ్మెల్యే, మంత్రి పేర్నినాని , మరో మంత్రి మోపిదేవీ జగన్ కు ఈ విషయం వివరించడం.. ఆయన ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి సీఎం జగన్ తక్షణం చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించడం జరిగిపోయింది. దీనిపై సమగ్ర నివేదికను అందించే బాధ్యతను ప్రతిష్టాత్మక వాప్కోస్ సంస్థకు అప్పగించారు. నివేదిక వచ్చాక బందరు హార్బర్ నిర్మాణానికి ప్రభుత్వం టెండర్లు పిలవనుంది. దీంతో ఎన్నో ఏళ్ల బందరు వాసుల కలను జగన్ సర్కారు తీర్చబోతోంది.


Tags:    

Similar News