బీజేపీలో జనసేన విలీనం..టాలీవుడ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..

Update: 2019-08-07 08:36 GMT
ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో ఎవరు ఊహించని విధంగా జనసేన పార్టీ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆఖరికి పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల ఓటమి పాలయ్యారు. రాజోలు నుంచి రాపాక వరప్రసాద్ ఒక్కరే గెలిచి పార్టీ పరువు నిలిపారు. అయితే ఇంతటి భారీ ఓటమి తర్వాత పవన్ కళ్యాణ్ గాని - జనసేన నేతలు గాని పెద్దగా బయటకు రాలేదు. ఈ తరుణంలోనే గతంలో ప్రజారాజ్యం పరిస్థితి ఎలా అయిందో....ఇప్పుడు జనసేన పరిస్తితి అదే కాబోతుందని - జనసేన బీజేపీలో విలీనం అవ్వబోతుందని వార్తలు వచ్చాయి.

ఈ ప్రచారం ఉండగానే తానా సభలకు అమెరికా వెళ్ళిన పవన్ కళ్యాణ్..బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ తో భేటీ అయ్యారు. దీంతో విలీనం వార్తలకు మరింత బలం చేకూరింది. ఈ క్రమంలోనే వారం రోజుల నుంచి పవన్ నియోజకవర్గాలుగా పార్టీ నేతలతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పవన్ పదే పదే జనసేనని విలీనం చేసే ప్రసక్తి లేదని ప్రకటనలు చేస్తూ వచ్చారు. పైకి ప్రకటనలు చేస్తున్నా చాలమందికి జనసేన విలీనంపై అనుమానాలు ఉంటూనే ఉన్నాయి.

ఇక ఈ అనుమానాలకి మరింత బలం చేకూర్చేలా తాజాగా బీజేపీ నాయకురాలు - టాలీవుడ్ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎప్పటికైనా పవన్ జనసేనని బీజేపీలో విలీనం చేసేస్తారని షాకింగ్ కామెంట్స్ చేసింది. 2014లో బీజేపీకి మద్ధతు ఇచ్చిన పవన్...ఆ తర్వాత బయటకొచ్చారని...కానీ మళ్ళీ ఇప్పుడు చేసిన తప్పు తెలుసుకుని పార్టీని విలీనం చేస్తారేమో అని - విలీనం చేస్తే బాగుంటుంది చెయ్యకపోతే ఆయన ఇష్టమని మాధవీలత చెప్పుకొచ్చింది.

కాగా, మొన్న ఎన్నికల్లో మాధవీలత బీజేపీ నుంచి గుంటూర్ వెస్ట్ నుండి పోటీ చేసి ఓడిపోయారు. అయితే  ఎన్నికల ముందు కూడా ఆమె పవన్ బీజేపీతో కలిసి పనిచేస్తే బాగుంటుందని వ్యాఖ్యానించారు. ఎప్పుడైనా కలిసి పని చేసే అవకాశం ఉందని కూడా అన్నారు. మరి చూడాలి రానున్న రోజుల్లో మాధవీలత వ్యాఖ్యలు నిజమవుతాయో లేదో ?  చూడాలి.


Tags:    

Similar News