కొంతమంది నోటి నుంచి వచ్చే కొన్ని మాటలు విచిత్రంగా ఉండటమే కాదు.. వివాదాస్పదంగా మారుతుంటాయి. వారి నోటి నుంచి వచ్చింది నిజమా? అబద్ధమా? అన్న విషయాన్ని చెప్పలేం గానీ... ప్రభావితం చేస్తాయి. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మీద మాజీ ఎంపీ ఒకరు తీవ్ర ఆరోపణలు చేయటమే కాదు.. తాను ఉత్త పుణ్యానికి ఆరోపణలు చేయటం లేదని.. తాను చేస్తున్న ఆరోపణలకు లాజిక్కు ఉందంటూ చెబుతున్నారు. ఆయన నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయాష్కీ. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న నయీం ఎన్ కౌంటర్ పై తాజాగా యాష్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర ఆరోపణలు చేసిన యాష్కీ.. గ్యాంగ్ స్టర్ నయీం ఎన్ కౌంటర్.. ప్రధాని మోడీకి కేసీఆర్ ఇచ్చిన బహుమతిగా ఆరోపించారు. నయీం ఎన్ కౌంటర్ ప్రధానికి కానుకను పంపినట్లుగా ఆయన వ్యాఖ్యానించారు. అలా ఎలా అనేస్తారన్న ప్రశ్నకు సమాధానం చెబుతూ.. సోహ్రబుద్దీన్ ఎన్ కౌంటర్ కేసులో నయీం ప్రత్యక్ష సాక్షి అని.. అందుకే.. అతన్ని అడ్డు తొలగించినట్లుగా నాకు అనిపిస్తోంది అంటూ యాష్కీ చెప్పారు.
సోహ్రబుద్దీన్ ఎన్ కౌంటర్ కేసులో బీజేపీ చీఫ్ అమిత్ షా నిందితుడని.. ఆయన్ను ఈ కేసు నుంచి విముక్తి చేయటం కోసమే తెలంగాణ ప్రభుత్వం నయీం ఎన్ కౌంటర్ ను మోడీ సర్కారుకు ప్రత్యేక కానుకగా అందించిందన్నట్లుగా అనుమానం కలుగుతుందని యాష్కీ వ్యాఖ్యానించటం గమనార్హం. టీఆర్ ఎస్ నేత సాంబశివుడిని హత్య చేసినా పట్టించుకోని ప్రభుత్వం.. ఇప్పుడే ఎందుకు రియాక్ట్ అయ్యారు? అతన్ని ప్రభుత్వం ఎందుకు ఎన్ కౌంటర్ చేయాల్సి వచ్చిందన్న అంశంపై క్లారిటీ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. యాష్కీ మాటలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నట్లుగా ఉండటం ఒక విశేషమైతే.. ఈ ఇష్యూపై టీఆర్ఎస్ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.