తెలంగాణ రాష్ట్ర స్పీకర్ మధుసూదనాచారికి చిత్రమైన సందేహం వచ్చింది. తన మనసులో వచ్చిన సందేహాన్ని ఆయన అట్టే అట్టిపెట్టుకోకుండా నలుగురితో పంచుకున్నారు. వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన ఆయన తన మనసులోని మాటను చెప్పి అందరి మెదళ్లకు పదును పదును పెట్టే ప్రయత్నం చేశారు.
సభాపతిని స్పీకర్ అంటారని.. కానీ.. సభలో సభ్యులంతా మాట్లాడతారని.. తమ సమస్యల్ని ఏకరవు పెడతారని.. కానీ సభాపతి స్థానంలో ఉన్న వ్యక్తికి మాత్రం అలా మాట్లాడే అవకాశం ఉండదన్న ఆయన.. ‘‘మాట్లాడే అవకాశం లేని వ్యక్తిని స్పీకర్ అని ఎందుకు అంటారు? సభను నియంత్రణలో ఉంచటం.. సభకు సంబందించిన విషయాల్ని మినహా మరేమీ మాట్లాడటం అన్నది స్పీకర్ కు ఉండదు. కానీ.. ఆ పదవికి స్పీకర్ అని పేరు ఎందుకు పెట్టారు? స్పీకర్ ను సభాపతి అని ఎందుకు అంటారో తెలీటం లేదు. మీరైనా కనుక్కొని చెప్పాలి’’ అంటూ పాత్రికేయులకు చెప్పారు.
ఇలాంటి సమస్యల్ని మధుసూదనాచారి విలేకర్లను అడగాల్సిన దాని కంటే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను అడిగితే బాగుండేదేమో. నిత్యం పుస్తకాలతో కుస్తీ పట్టే ఆయనకు ఇలాంటి సందేహాలకు ఇట్టే సలహాలు ఇస్తారన్న మాటను చెబుతుంటారు. ఏమైనా.. తన సందేహాన్ని బయటపెట్టి.. పాత్రికేయుల మీద పెద్ద పనే తెలంగాణ స్పీకర్ పెట్టారని చెప్పాలి. మరి.. ఆయన సందేహాన్ని ఎవరు తీరుస్తారో చూడాలి.