రాబోయే రోజుల్లో అన్నం వండి తినిపిస్తారేమో? ఉచితాలపై మద్రాస్ హైకోర్టు సంచలనం
తమిళనాడు అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో అధికార.. విపక్ష పార్టీలు పోటాపోటీగా ఉచిత హామీల్ని ఇస్తుండటం తెలిసిందే. ఇప్పటికే తాము గెలిస్తే కలర్ టీవీ ఇస్తామని ఒకరు చెబితే.. మరొకరు వాషింగ్ మెషీన్ ఇస్తామని హామీ ఇవ్వటం తెలిసిందే. ఇలా.. ఇట్టే ఆకర్షించే ఎన్నికల హామీలపై ఒళ్లు మండిన వ్యక్తి ఒకరు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.
ఉద్యోగాలు.. మౌలిక వసతుల కల్పన.. విద్యా వైద్య రంగాల అభివృద్ధి.. రవాణా.. వ్యవసాయ రంగాల్ని పక్కన పెట్టేసి ఉచితాల మీదనే పార్టీలు ఫోకస్ చేయటాన్ని తప్పు పట్టారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన జస్టిస్ కిరుబకరన్.. జస్టిస్ పుగలెంతిల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా వారు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉచిత పథకాలకు సంబంధించిన హామీలు ఇస్తున్న పార్టీల తీరును తీవ్రంగా తప్పు పట్టటమే కాదు.. ఉచిత పథకాలతో ప్రజలు సోమరుపోతులుగా మారుతున్నారన్నారు.
ఒక్కో నియోజకవర్గంలో అభ్యర్థులు తక్కువలో తక్కువ రూ.20 కోట్లు ఖర్చు చేస్తున్నారని.. బిర్యానీ.. బీరు కోసం ఓటు వేస్తే మీ నాయకుడ్ని ప్రశ్నించే నైతిక హక్కు మీకు ఎక్కడ ఉంటుందని ప్రశ్నించిన ధర్మాసనం.. ప్రజాస్వామ్యంలో నచ్చిన నేతను ఎన్నుకునే స్వేచ్ఛ ప్రజలకు ఉన్నప్పటికి.. పార్టీలు ఇస్తున్న ఉచితాలపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తమిళనాడు ప్రధాన పార్టీలైన డీఎంకే.. అన్నాడీఎంకేలు మహిళలకు రేషన్ కోసం ఆర్థిక సాయాన్ని చేస్తామని ప్రకటించాయి.
ఉచిత హామీల సంప్రదాయం కొనసాగటం ఏ మాత్రం మంచిది కాదని.. ఇదే తీరులో సాగితే రానున్న రోజుల్లో అన్నం కూడా వండి తినిపిస్తారేమోనని వ్యంగ్య వ్యాఖ్యలు చేసింది. ఉచిత హామీల్ని అవినీతి వ్యవహారంగా పరిగణించాల్సిన అవసరం ఉంటుందని.. వీటి వల్ల ఓటర్లు ప్రభావితమవుతారని అభిప్రాయపడింది. ఉచిత హామీలు తమిళ ప్రజల్ని బద్ధకస్తులుగా మారుస్తున్నారని.. అందుకే హోటళ్లు.. సెలూన్ లు.. చివరకు పొలాల్లో పని చేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూలీల్ని రప్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేసింది.
ఉచితన పథకాలకు సంబంధించిన పిటిషనర్ పేర్కొన్న 20 ప్రశ్నలకు కేంద్ర ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. ఉచిత హామీల్ని అడ్డుకునేందుకు వీలుగా ఎలాంటి చర్యలు చేపడతారో ఏప్రిల్ 26లోపు స్పష్టం చేయాలని పేర్కొంది. కీలక ఎన్నికల వేళ.. ఉచితాలపై మద్రాస్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు.. తాజాగా జారీ చేసిన ఆదేశాలు సంచలనంగా మారాయి. మరి.. దీనిపై ఈసీ ఏ రీతిలో రియాక్టు అవుతుందో చూడాలి.