చూసేందుకు సన్యాసిగా కనిపించే ప్రొఫెసర్ మహాన్ మహారాజ్ కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కాషాయ వస్త్రాలతో అసలుసిసలు సన్యాసిలా కనిపించే ఆయన మ్యాథ్స్ ప్రొఫెసర్. లెక్కల్లో ఆయనకున్న పట్టు తెలిసిన వారు ఆశ్చర్యపోతుంటారు. ఆయనలో విషయం ఎంత ఉందనటానికి ఒక్క ఉదాహరణలో చెప్పాలంటే.. జామెట్రిక్ గ్రూప్ థియరీ.. లో మైడెన్షనల్ టోపాలజీ.. కాంప్లెక్స్ జ్యామెట్రీ విభాగాల్లో ఆయన చేసిన సేవలకు ఇన్ఫోసిస్ అందించే రూ.65లక్షల బహుమానానికి ఆయన ఎంపిక కావటాన్ని చెప్పొచ్చు.
కాలిఫోర్నియాలో పీహెచ్ డీ చేసిన ఆయన.. ఇటీవల ముంబయిలోని టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ ప్రొఫెసర్ గా ఆయన ఇటీవల అపాయింట్ అయ్యారు. 1998లో రామకృష్ణ మిషన్ లో చేరిన ఆయన.. నిత్యం కాషాయ వస్త్రాలు ధరిస్తారు. కాషాయ వస్త్రాల్ని ధరించటానికి ఆయన వివరణ ఇస్తూ.. కాషాయం అన్నది నిరాడంబరతకు చిహ్నంగా చెబుతారు. తాను వేసుకునే కాషాయ వస్త్రాలు ఏ మతానికి సంబంధం ఉండదని తేల్చి చెబుతుంటారు.
తన తలకు తుపాకీని పెట్టినా.. లెక్కలే తన మతంగా చెబుతానని చెబుతారు. 2011లో అత్యుత్తమ పురస్కారాల్లో ఒకటైన శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డును సొంతం చేసుకున్న ఆయనకు.. రేఖా గణితంలో తిరుగులేని పట్టు ఉందని చెబుతారు. మహాన్ మహరాజ్ ను చూసినప్పుడు అనిపించే భావనకు.. ఆయన గురించి వివరాల్ని తెలిసినప్పుడు కలిగే భావనకు ఏ మాత్రం పోలిక ఉండదు. మహాన్ మహారాజ్ ను కలిసినప్పుడు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కనిపించేదానికి.. అసలుకు ఏ మాత్రం సంబంధం ఉండదని.. కంటికి కనిపించేదానిని నమ్మటం కూడా సరికాదని తెలుస్తుంది.