సీనియర్ల ని పక్కన పెట్టేసారు .. బయట పడ్డ అసంతృప్తి !

Update: 2020-01-03 05:58 GMT
మహారాష్ట్ర రాజకీయం గురించి అందరికి తెలిసిందే. ఎన్నికల ఫలితాల వరకు అంతా సజావుగా సాగిన మహా రాజకీయం ..ఎన్నికల ఫలితాల తరువాత ఒక్కసారిగా ఊహకందని రీతిలో మారి పోయింది. ముఖ్యమంత్రి సీటు కోసం బీజేపీ అధికారాన్ని కూడా వదిలేసుకుంది. ఆ తరువాత తమ వ్యూహాలతో రాత్రికి రాత్రే సంప్రదింపులు జరిపి అధికారం చేపట్టినా .. పవార్ చక్రం తిప్పడం తో మళ్లీ బీజేపీ వెనక్కి తగ్గక తప్పలేదు. దీనితో ఆ తరువాత శివసేన , కాంగ్రెస్ , ఎన్సీపీ కలిసి మహా వికాస్‌ ఆఘాడి పేరుతొ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసారు. ఇక తాజాగా ఈ మహా వికాస్‌ ఆఘాడి ప్రభుత్వం మంత్రి వర్గాన్ని విస్తరించింది. దీనితో తమకి మంత్రివర్గంలో చోటు ఖాయం అనుకున్న వారికీ కూడా చోటు దక్కకపోవడంతో .. అసంతృప్తులను ఆగ్రహానికి గురై ప్రభుత్వం పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

మహా వికాస్‌ ఆఘాడి ప్రభుత్వంలో మంత్రలుగా అవకాశం లభిస్తుందనుకున్న పలువురు సీనియర్లకు నిరాశే మిగిలింది. మంత్రివర్గ విస్తరణ జరిగి నాలుగు రోజులైన తరువాత అసంతృప్తుల ఒక్కొకరూ బయట కు వస్తున్నారు. ఈ నేపథ్యం లో మంత్రివర్గ విస్తరణలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ప్రణతీ షిండేకు స్థానం కల్పించకపోవడంతో ఆగ్రహానికి గురైన ఆమె మద్దతు దారుల గురువారం షోలాపూర్‌ కాంగ్రెస్‌ భవనం ఎదుట ధర్నా, ఆందోళన నిర్వహించారు. సీనియర్ నేత సుశీల్‌ కుమార్‌ షిండే కుమార్తె ప్రణతీ షిండే షోలాపూర్‌ సిటీ సెంట్రల్‌ నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్‌ సాధించారు.

దీంతో కేబినెట్‌ లో చోటు దక్కడం ఖాయమని ఆమె భావించారు. ఈ మేరకు తమ మద్దతుదారులకూ భరోసా ఇచ్చారు. కానీ , మహా వికాస్‌ ఆఘాడి మంత్రి వర్గ విస్తరణ లో తనను చిన్న చూపు చూశారని, ఇప్పటికైనా నాయకులు మనసు మార్చుకుని స్థానం కల్పించాలని ఆమె డిమాండ్‌ చేశారు. కొత్తగా ఎన్నికైన వారికి పదవులు కట్ట బెట్టారని, సీనియర్ల కు అన్యాయం చేశారని ఆమె ఆరోపించారు. కాగా ప్రణతీతో పాటు మరికొందరు నేతలు కూడా మంత్రివర్గ విస్తరణపై తీవ్ర అసంతృప్తి గా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రణతీకి మంత్రివర్గంలో స్థానం కల్పించని పక్షంలో మహారాష్ట్ర ప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జీ మల్లిఖార్జున్‌ ఖర్గే దిష్టిబొమ్మను దహనం చేస్తామని ఆమె మద్దతు దారులు హెచ్చరించారు. ఈ అసంతృప్తుల జాబితా లో శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ సోదరుడు సేన ఎమ్మెల్యే సునీల్‌ రౌత్‌ కూడా ఉన్నట్లు సమాచారం. సునీల్‌కు మంత్రిపదవి కోసం సంజయ్‌ తొలి నుంచి ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే అనూహ్యంగా అతడికి చోటు దక్కలేదు. దీనితో రౌత్‌ తీవ్ర అసంతృప్తికి గురియ్యారని సమాచారం.


Tags:    

Similar News