మహారాష్ర్ట గవర్నరుగా ఉన్న మన తెలుగు నేత విద్యాసాగరరావు విచిత్ర పరిస్థితిని ఎదుర్కోబోతున్నారు... అక్కడి రాజ్ భవన్ లో గవర్నరు హోదాలో అత్యంత గౌరవం దక్కించుకుంటున్న ఆయనకు వస్తున్న జీతం కంటే ఆయన కార్యదర్శి జీతం ఎక్కువ కాబోతోంది... అక్కడి వేతన సవరణ సిఫారసుల తరువాత గవర్నరు కంటే గవర్నరు కార్యదర్శి జీతం పెరుగుతోంది. దీంతో పాటు మహారాష్ట్రలో సీఎం, ఎమ్మెల్యేల జీతాలనూ అక్కడి ప్రభుత్వం పెంచింది.. దీంతో మహా సీఎం ఫడ్నవీస్ జీతం రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ జీతం కంటే ఎక్కువ కానుంది.
మహారాష్ట్రలో గవర్నరు, శాసనసభ్యులు, కార్యదర్శుల జీతాల విషయంలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొనబోతోంది. త్వరలో ఇక్కడ ఏడవ పే కమిషన్ సిఫార్సులు అమలు కానున్నాయి. అవి అమలు అయితే గవర్నరు వేతనం కంటే ఆయన సొంత సెక్రటరీ శాలరీ ఎక్కువగా ఉంటుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి… రాష్ట్రపతి కంటే ఎక్కువ మొత్తంలో జీతం తీసుకుంటారు. ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు, ఎమ్ఎల్ఎల జీతాలను పెంచుతూ రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఆ రాష్ట్ర గవర్నర్ సి. విద్యాసాగర్‌రావు ఎప్పటిలాగే నెలకు 1.1 లక్షలు శాలరీ తీసుకుంటే ఆయన సొంత సెక్రటరీ 1.44లక్షలు జీతంగా పొందుతారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేతనం 2.25 లక్షలకు చేరుతుంది.
అలాగే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ వేతనం 2.25 లక్షలయితే….దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి వేతనం 1.5 లక్షలు మాత్రమే ఉంటుంది. ఉపరాష్టపతి వేతనం 1.25 లక్షలు ఉంది. 2008లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్‌ల వేతనాలు పెరిగాయి. మహారాష్ట్రలో పెరుగుతున్న ఈ వేతనాల కారణంగా రాష్ట్రంపై సంవత్సరానికి 21వేల కోట్ల భారం పెరుగుతుంది. ఇప్పటికే రిజర్వుబ్యాంకు లెక్కల ప్రకారం రాష్ట్ర రుణభారం అన్ని రాష్ట్రాలకంటే ఎక్కువగా 3.79లక్షల కోట్లు ఉంది. కాగా ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి జీతం భారీగా పెరిగిన మహారాష్ట్రలో 15ఏళ్లగా టీచర్ల జీతాల్లో పెరుగుదల లేదు. 2005 నుండి వారి పెన్షన్ సదుపాయాలు కూడా ఆగిపోయాయి.