మొత్తానికి మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం నుంచి కొత్త ప్రభుత్వం ఉదయించబోతోంది. బీజేపీకి చెందిన మాజీ సీఎం, ప్రస్తుత సభలో విపక్ష నాయకుడు అయిన దేవేంద్ర ఫడ్నవీస్ కొత్త సీఎం గా, శివసేన రెబెల్ లీడర్ ఏక్ నాధ్ షిండే డిప్యూటీ సీఎం గా ప్రమాణం చేసే ముహూర్తం దగ్గరపడినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక మొత్తం మహా క్యాబినేట్ లో 42 మంది మంత్రులు ఉంటారని తెలుస్తోంది. ఇందులో నుంచి శివసేన రెబెల్స్ కి 13 మంత్రి పదవులు కేటాయించనున్నారు.
ఈ మేరకు సిద్ధమైన జాబితాతో మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఢిల్లీ వెళ్లారు. ఆయన బీజేపీ అగ్ర నేతలతో కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. హో మంత్రి అమిత్ షాతో భేటీ అవుతున్నారు. మొత్తానికి చూస్తే అతి తొందరలో బీజేపీ నాయకత్వాన మహా రాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం తధ్యంగా కనిపిస్తోంది.
అదే టైమ్ లో మహా పరిణామాలను బీజేపీ చాలా ఒడుపుగా ఉపయోగించుకుంటోంది. షిండే వర్గం వద్ద 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీకి 106 నంది ఉన్నారు. సింపుల్ మెజారిటీకి 144 మంది అవసరం అవుతారు. అయితే దాని కంటే ఇద్దరు ఎక్కువగానే ఉన్నారు. ఇక మరికొందరు కూడా శివసేన వైపు రావచ్చు అని టాక్ నడుస్తోంది. అదే టైమ్ లో శివసేన నుంచి 13 మంది ఎంపీలు కూడా ఏక్ నాధ్ సిబిరంలో చేరి కేంద్రంలో మంత్రి పదవులు పొందేందుకు తమ వంతుగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా చెబుతున్నారు.
ఇక మహారాష్ట్రలో బలనిరూపణకు గవర్నర్ తొందరలోనే సభను సమావేశపరుస్తారు అని తెలుస్తోంది. అయితే ఇంకా దింపుడు కళ్ళెం ఆశ మీద ఉన్న ఉద్ధవ్ థాక్రే శివసేన రెబెల్ ఎమ్మెల్యేలు ముంబైలో ల్యాండ్ అయితే కచ్చితంగా మనసు మార్చుకుని తమ వైపునకు వస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు కానీ అది సాధ్యమయ్యే పరిస్థితి అయితే ఏ కోశానా కనిపించడంలేదు. మొత్తానికి రెబెల్స్ తిరుగుబాటుతో బాగా బక్కచిక్కిన శివసేన ఇపుడు దిక్కులు చూస్తోంది. దేవేంద్ర ఫడ్నవీస్ మరో మారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి రంగం సిద్ధమైపోయింది.