అమ్మ ఆత్మ మళ్లీ మాట్లాడింది

Update: 2017-03-01 04:53 GMT
అమ్మ మరణం మీద అనుమానాలకు అంతు లేదు. ఇది సరిపోదన్నట్లుగా ఆ మధ్యన అమ్మ ఆత్మ తనతో మాట్లాడినట్లుగా చెప్పుకున్నారు అమ్మకు అత్యంత విధేయుడు.. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం. చిన్నమ్మ సీఎం అయ్యేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత.. అనుకోని విధంగా గవర్నర్ కారణంగా ఆ ప్రక్రియకు అడ్డుకట్ట పడిన వేళ.. అమ్మ సమాధి వద్దకు వెళ్లి కాసేపు ధ్యానం చేసిన అనంతరం.. అమ్మ తనతో మాట్లాడినట్లుగా పన్నీర్ సెల్వం వెల్లడించి సంచలనం సృష్టించారు. ఆ తర్వాత చిన్నమ్మపై పోరుబాటు షురూ చేసింది తెలిసిందే.

ఇదిలా ఉంటే.. తాజాగా అమ్మ జయలలిత ఆత్మ తనతో మాట్లాడినట్లుగా చెప్పుకున్నారు తిరువరూరుకి చెందిన శ్రీ మహరుషి అనే సాధువు. మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంను చెన్నైలోని గ్రీన్ వేస్ రోడ్డులో ఉన్న ఆయన నివాసానికి వచ్చి కలిసిన సాధువు.. అమ్మ ఆత్మ తనతో మాట్లాడినట్లుగా వెల్లడించటం ఇప్పుడు సంచలనంగా మారింది.

అమ్మ ఆత్మ తనతో మాట్లాడుతూ.. తనను 75 రోజుల పాటు ఆసుపత్రిలో ఉంచారని.. అన్నాడీఎంకే పార్టీని పన్నీర్ సెల్వం.. దీప జయకుమార్ లే రక్షించాలని అమ్మ ఆత్మ కోరినట్లుగా చెప్పారు. పన్నర్ కు మద్దతు తెలిపిన ఆయన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పార్టీని రక్షించాలని చెప్పిన అమ్మ ఆత్మ.. తన మరణంపై వెల్లువెత్తిన సందేహాలపై సాధు పుంగవునికి ఏం చెప్పారన్నది మాత్రం ఆయన చెప్పకపోవటం గమనార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News