నవ్యాంధ్రప్రదేశ్ లో కొత్త ఉద్యమం స్టార్ట్ అవుతుంది. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ కొద్ది రోజులుగా జరుగుతున్న ఆందోళనలు, నిరసనలు కాస్త ఉద్యమరూపం దాలుస్తున్నాయి. చంద్రబాబు ఢిల్లీ పర్యటన వరకు ఓపిక పట్టిన ప్రజలు బాబు-మోడీ సమావేశం తర్వాత ఎటువంటి ప్రకటన రాకపోవడంతో రోడ్లమీదకు వస్తున్నారు. గురువారం ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ విశాఖపట్నం, విజయవాడలో బీజేపీకి వ్యతిరేకంగా ఆ పార్టీ కార్యాలయాల ముందు ఆందోళనలు, నిరసనలకు దిగారు.
విశాఖపట్నంలోని బీజేపీ కార్యాలయం వద్ద ప్రత్యేక హోదా వెంటనే ఇవ్వాలని ప్రత్యేక హోదా సాధన సమితి సమాఖ్య కార్యకర్తలు ధర్నాకు దిగారు. విభజన చట్టంలోని హామీలన్నింటిని తక్షణమే అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రత్యేక ప్యాకేజీలతో ఉపయోగం లేదని...ప్రత్యేక హోదా కోసం ఆంధ్రులందరు రోడ్డుమీదకు వచ్చి పోరాటం చేస్తే ప్రత్యేక హోదా దానంతట అదే వస్తుందంటున్నారు.
విజయవాడలో మాలమహానాడు కార్యకర్తలు బీజేపీ ఆఫీస్ ముందు బైఠాయించారు. ప్రాణాలైనా అర్పిస్తాం..ప్రత్యేక హదా సాధిస్తామంటూ వారు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాలమహానాడు కార్యకర్తలు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ఆ రోజు కాంగ్రెస్ రాష్ర్టాన్ని అడ్డగోలుగా విభజిస్తుంటే కళ్లుమూసుకుని కూర్చుందని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక హోదా ఇస్తామని...ఇప్పుడు తీరా అధికారంలోకి వచ్చాక ఈ రోజు మాట మారుస్తోందని వారు బీజేపీ తీరును దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని వారు ఉద్యమించేందుకు రెఢీ అవుతున్నారు.
ఇదిలా ఉంటే గురువారం ఉదయం నెల్లూరు జిల్లా వేదాయపాళెంలో లక్ష్మయ్య అనే వ్యక్తి ప్రత్యేక హోదా కోరుతూ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు చేసుకున్నారు. ఇవన్ని చూస్తుంటే ఏపీ స్పెషల్ స్టేటస్ ఉద్యమం ఉధృతంకానుంది. ఇది పెనుఉద్యమంగా మారి ఈ సెగ ఢిల్లీ పీఠాన్ని తాకే వరకు పోరాటం చేస్తే మోడీ కాదు ఎవరైనా దిగొస్తారు.