అత్యున్నత స్థానాల్లో ఉన్న వారికి సామాన్యుల మాదిరి స్వేచ్ఛ ఉండదు. వారి కదలికల మీద సవాలక్ష ఆంక్షలు ఉంటాయి. ఇదంతా వారి భద్రత కోసమే అన్న విషయం వారికి తెలిసినా.. తమకు ప్రైవసీ లేకపోవటాన్ని కొందరు పాజిటివ్ గా తీసుకోరు. తమకు తోచినట్లుగా వ్యవహరిస్తూ అధికారులకు షాకుల మీద షాకులు ఇస్తుంటారు. వయసులో పెద్దవారైతే ఫర్లేదు కానీ.. టీనేజ్.. ఆ పైన వారైతే.. తమదైన ప్రపంచంలో విహరించేందుకు అధికారులకు షాకుల మీద షాకులు ఇస్తూ.. టెన్షన్ పుట్టిస్తుంటారు.
తాజాగా అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా పెద్దమ్మాయ్ మాలియా ఒబామా ఇదే రీతిలో టెన్షన్ పెట్టించింది. చిన్నతనం నుంచి సుపరిచితమైన సీక్రెట్ ఏజెంట్స్.. అధికారులతో విసిగిపోయిందో ఏమో కానీ.. తన బాయ్ ప్రెండ్ ను తీసుకొని గుట్టుచప్పుడు కాకుండా న్యూయార్క్ లోని ఒక బార్ కు వెళ్లటం అధికారుల్ని ఉరుకులు.. పరుగులు పెట్టించింది. తీవ్ర టెన్షన్ కు గురి చేసింది.
న్యూయార్క్ లోని మన్ హటన్ ప్రాంతంలో ఉన్న "బి బార్ అండ్ గ్రిల్" కు తన బాయ్ ఫ్రెండ్ను తీసుకొని వచ్చింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా మాజీ అధ్యక్షుడి పెద్దకుమార్తె బార్ కు రావటంతో సీక్రెట్ అధికారులు ఒక్కసారి అలెర్ట్ అయిపోయారు. క్షణాల్లో బార్ బయటా.. లోపలా అధికారులు మొహరించారు.
బాయ్ ఫ్రెండ్ తో ఒబామా కుమార్తె మాలియా ఎలాంటి హడావుడి లేకుండా సాదాసీదాగా బార్ కు వచ్చిన సమాచారం అందుకున్న అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. టెన్షన్ తో చెమటలు పట్టినంతపనైంది. అయితే.. మాలియా ఇదేమీ పట్టించుకోకుండా బాయ్ ఫ్రెండ్ తో కలిసి డిన్నర్ పూర్తి అయ్యాక తాపీగా అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఆమెవెళ్లిపోయిన తర్వాత.. అధికారులు అక్కడ నుంచి వెళ్లిపోయారు. మాజీ అధినేత కుమార్తె పుణ్యమా అని సీక్రెట్ అధికారులకు ఇలాంటి షాకులు అప్పుడప్పుడు తగులుతూ ఉంటాయన్న మాట వినిపిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/