పశ్చిమ బెంగాల్ ‘సీతక్క’గా పేరు తెచ్చుకున్న ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ఎవరి మాట వినరు. తాను పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్లంటారు. తమ రాష్ట్రంలో కేంద్రం జోక్యాన్ని అస్సలు సహించరు. తాజాగా లాక్ డౌన్ వేళ బెంగాల్ లో కేంద్రం జోక్యంపై సీఎం మమతా బెనర్జీ అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. లాక్ డౌన్ పరిశీలనకు కేంద్ర బృందాలను ఎందుకు బెంగాల్ పంపిస్తున్నారని పీఎం మోడీ - హోంమంత్రి అమిత్ షాలను మమత డిమాండ్ చేశారు.
తాజాగా కోల్ కతా సహా ఏడు జిల్లాల్లో లాక్ డౌన్ అమలును తనిఖీ చేసేందుకు రెండు మంత్రిత్వ శాఖల కేంద్ర బృందం బెంగాల్ రాష్ట్రానికి చేరుకున్నారు. అయితే వీరిని పంపడంపై మమతా ఆగ్రహించారు. తమకు వివరణ ఇచ్చేంత వరకు వారికి సహకరించబోమని సీఎం మమత స్పష్టం చేశారు. ఈ మేరకు మోడీ - అమిత్ షాలకు లేఖ రాశారు. ఇది సమైఖ్య స్ఫూర్తికి విఘాతం అని మమత మండిపడ్డారు.
కేంద్ర బృందాలను బీఎస్ ఎఫ్ సెక్యూరిటీతో బెంగాల్ లో పర్యటింపచేయడంపై మమతా బెనర్జీ తీవ్రంగా విమర్శించారు. దీన్ని తాము అంగీకరించమని స్పష్టం చేశారు. తమకు సమాచారం లేకుండా ఎలా పర్యటిస్తారని నిలదీశారు.
అయితే కేంద్రం వాదన మరోలా ఉంది. దేశంలో లాక్ డౌన్ నిబంధనలు పాటించడం లేదని తమకు నివేదికలు అందాయని.. ఈ నేపథ్యంలోనే ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులను పరిశీలించేందుకు కేంద్ర బృందాలను పంపుతున్నామని కేంద్రం వివరణ ఇచ్చింది.