పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా కంటిన్యు అవటానికి మమతాబెనర్జీ రూటుమార్చినట్లే ఉంది. ఎంఎల్ఏగా ఓడిపోయిన మమత బెంగాల్లో శాసనమండలి పునరుద్ధరణకు తీర్మానం చేయించారు. మొన్నటి బెంగాల్ ఎన్నికలో నరేంద్రమోడి, అమిత్ షా ఇద్దరినీ మమతబెనర్జీ చాపచుట్టి మూలన పెట్టేసినట్లుగా ఘోరంగా ఓడించింది. 221 సీట్ల అఖండ విజయంతో హ్యాట్రిక్ సీఎం అనిపించుకున్నారు.
పార్టీని 221 నియోజకవర్గాల్లో గెలిపించుకున్న మమత చివరకు తాను పోటీచేసిన నందిగ్రామ్ నియోజకవర్గంలో ఓడిపోయారు. సరే ఇపుడు ఎన్నికల్లో ఓడిపోయినా ఎవరు అవమానంగా ఫీలవ్వటంలేదు. అందుకనే మమత కూడా సీఎంగా ప్రమాణస్వీకారం చేసేశారు. ఎంఎల్ఏగా గెలవకపోయినా సీఎం అయ్యారు కాబట్టి ఆరుమాసాల్లో ఎక్కడినుండో ఒకచోట నుండి గెలవాలి. ఎలాగూ మూడు నియోజకవర్గాలు ఉపఎన్నికలకు రెడీగా ఉంది. కాబట్టి ఏదో చోట నుండి పోటీ చేసి గెలవటం ఖాయమనే అనుకున్నారు.
అయితే కరోనా వైరస్ సమస్య అడ్డుపడింది. ఇదే సమస్య ఎదురవ్వటంతో ఉత్తరాఖండ్ సీఎంగా తీరద్ సింగ్ రావత్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఎంపి అయిన రావత్ సీఎం అయ్యారు. అయితే ఆరుమాసాల్లో ఎంఎల్ఏగా ఎన్నికయ్యే అవకాశం లేకపోవటంతో మూడు రోజుల క్రితమే రాజీనామా చేశారు. బెంగాల్లో మమత సీఎంగా కంటిన్యు అయ్యేందుకు నవంబర్ నెలవరకు సమయముంది.
అయితే నవంబర్ లోగా ఉపఎన్నిక జరిపే విషయం కేంద్ర ఎన్నికల కమీషన్ చేతిలో ఉంది. మరి కమీషన్ మీద నమ్మకం లేదేమో అందుకనే శాసనమండలి పునరుద్ధరణకు అసెంబ్లీలో తీర్మానం చేశారు. మొన్నటి ఎన్నికల్లోనే మండలి పునరుద్ధరణకు మమత ఎలాగూ హామీఇచ్చున్నారు. అందుకనే తాజాగా మండలి పునరుద్ధరణకు తీర్మానం చేసి ఆమోదానికి కేంద్రానికి పంపారు. మరి కేంద్రం బెంగాల్ అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదిస్తుందా ? అసలు మమత ఎందుకని తన రూటు మార్చుకున్నారో ఎవరికీ అర్ధం కావటంలేదు. చూద్దాం ఏం జరుగుతుందో.