పవన్ పవర్ ఫుల్ స్పీచ్ కోసం వెయిటింగ్ !

మరి పవన్ గంట సేపు మాట్లాడుతారా అంతకు మించి మాట్లాడుతారా అన్నది కూడా ఉంది. అయితే పవన్ స్పీచ్ మాత్రం ఈసారి వేరే లెవెల్ లో ఉండొచ్చు అని అంటున్నారు.;

Update: 2025-03-11 12:30 GMT

జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోసం అంతా వెయిట్ చేస్తున్నారు. ఇటీవల ఆయన అసెంబ్లీలో ప్రసంగం తప్ప పెద్దగా మాట్లాడింది లేదు. దానికంటే ముందు చూసుకున్నా ఆయన నుంచి వేడెక్కించే డైలాగులతో కూడిన స్పీచ్ వచ్చి చాలా కాలం అయింది అని అంటున్నారు. ముఖ్యంగా కాకినాడ పోర్టు అక్రమ బియ్యం వ్యవహారం తరువాత పవన్ పవర్ ఫుల్ స్పీచ్ అన్నది పెద్దగా ఎక్కడా కనిపించలేదని అంటారు.

ఇలా అందరి కోరికతో పాటు జనసైనికుల హుషార్ ని కూడా పెంచుతూ పవన్ పవర్ ఫుల్ స్పీచ్ చేయనున్నారు అని అంటున్నారు. అది ఎపుడు అంటే ఈ నెల 14న పిఠాపురంలో జనసేన ఆవిర్భావ వేడుకల సందర్భంగా సాయంత్రం నాలుగు గంటలకు యాభై ఏకరాల సువిశాల మైదానంలో ప్రారంభం అయ్యే బహిరంగ సభలో పవన్ స్పీచ్ ఉంటుంది అని అంటున్నారు.

మరి పవన్ గంట సేపు మాట్లాడుతారా అంతకు మించి మాట్లాడుతారా అన్నది కూడా ఉంది. అయితే పవన్ స్పీచ్ మాత్రం ఈసారి వేరే లెవెల్ లో ఉండొచ్చు అని అంటున్నారు. ఏపీలో రాజకీయ పరిస్థితులు ప్రస్తుతం సాగుతున్న పరిణామాలు విపక్షం వైసీపీ తీరు ఏపీలో సాగుతున్న అభివృద్ధి చేసిన కార్యక్రమాలు చేయాల్సిన వాటికి సంబంధించి పెట్టుకున్న అజెండా జాతీయ రాజకీయాలు ఇలా అన్నీ కలసి పవన్ స్పీచ్ లో కనిపించవచ్చు అని అంటున్నారు.

అంతే కాదు ఏపీలో టీడీపీ కూటమి బంధం పైనా పవన్ కామెంట్స్ ఉండొచ్చు అని అంటున్నారు. పదిహేనేళ్ళ పాటు టీడీపీ తో జనసేన బంధం అంటే దాని వెనక అర్ధం పరమార్ధం తమ పార్టీ క్యాడర్ కి పవన్ వివరించే ప్రయత్నం చేయవచ్చు అని అంటున్నారు. ఇన్నేళ్ళ పాటు జనసేన కేవలం జూనియర్ పార్టనర్ గా ఉంటూ టీడీపీకే పెద్దన్న పాత్రలో ఉంచుతుందా అన్న జనసేన సందేహాలకు ఆయన నుంచి సమాధానం రావచ్చు అని అంటున్నారు.

ప్రస్తుతం జనసేన ప్రయాణంతో పాటు భవిష్యత్తు ప్రస్తానం గురించి కూడా పవన్ స్పష్టమైన తీరులో వివరించవచ్చు అంటున్నారు. అంతే కాదు క్యాడర్ కి దిశా నిర్దేశం చేయవచ్చు అని అంటున్నారు. ఇక పవన్ స్పీచ్ అంటేనే జనసైనికులకు ఒక ఊపూ ఉత్సాహం ఉంటాయి. దాంతో పాటు సీఎం అన్న గోల ఎటూ ఉంటుంది. వీటికి కూడా పవన్ నుంచి జవాబు ఉండొచ్చు అని అంటున్నారు.

ఏది ఏమైనా ఏపీ పాలిటిక్స్ అయితే చప్పగానే సాగుతోంది. జగన్ అయితే పూర్తిగా సైలెంట్ గా ఉన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేతగా తనదైన శైలిలో పనిచేసుకుని పోతున్నారు. పవన్ కూడా ఈ మధ్య పెద్దగా మాట్లాడడంలేదు దాంతో వాడి వేడి లేని రాజకీయం సాగుతోంది.

ఈ దశలో జనసేన ఆవిర్భావ దినోత్సవం వేదికగా పవన్ చాలా రోజుల పాటు జనసైనికులు హుషారెత్తేలా స్పీచ్ ఇస్తారని అంటున్నారు. పవన్ స్పీచ్ లో మెరుపులు పంచులు సెటైర్లు హాట్ కామెంట్స్ కోసం అంతా ఎదురుచూస్తున్నారు. ఏపీలో అన్ని పార్టీలూ కూడా జనసేన ఆవిర్భావ సభ మీదనే ఫోకస్ పెడుతున్నాయి. పవన్ ఏపీ పాలిటిక్స్ లో కీలకంగా ఉన్నారు. దాంతో ఆయన పొలిటికల్ స్టేట్మెంట్స్ వైరల్ అవడం ఖాయం.

జనసేన సభకు కౌంట్ డౌన్ మొదలైంది. ఈ నెల 14న అంగరంగ వైభవంగా సాగే ఈ సభలో ఆద్యంతం పవన్ సెంటర్ అట్రాక్షన్ అనడంలో సందేహం లేదు. ఆయన చుట్టూనే కెమెరాలు ఆయనతోనే రాజకీయం ఆయనతోనే సభలూ సమావేశాలు అన్న తీరున సాగనుంది.

Tags:    

Similar News