అసెంబ్లీలో జగన్ "బొమ్మ" మోజును బయటపెట్టిన లోకేష్.. ఇక బొమ్మలు లేని యూనిఫాంలు..

వైసీపీ ప్రభుత్వంలో ప్రతీ పథకంలోనూ జగన్ మార్కు ఉండేలా చూసుకున్నారు. అయితే వైఎస్ఆర్ ఫొటో లేదంటే జగన్ ఫొటోలు ఉండేలా వస్తువులను తీర్చిదిద్దారు.;

Update: 2025-03-12 04:31 GMT

వైసీపీ ప్రభుత్వంలో ప్రతీ పథకంలోనూ జగన్ మార్కు ఉండేలా చూసుకున్నారు. అయితే వైఎస్ఆర్ ఫొటో లేదంటే జగన్ ఫొటోలు ఉండేలా వస్తువులను తీర్చిదిద్దారు. జగన్ తన ఫోటోలను ప్రభుత్వం అందించే స్టేషనరీ వస్తువులపై ముద్రించుకునేవారు, వీటిని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు పంపిణీ చేసేవారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి దానిపై తన చిత్రాలను ముద్రించుకోవడంపై టీడీపీ ఎన్నోసార్లు విమర్శించింది.



ఈ అంశాన్ని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తాజాగా వాటిని చూపిస్తూ వివరంగా చర్చించారు. లోకేశ్ అసెంబ్లీలో జగన్ హయాంలో ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా చేసిన పెనట్ బర్ఫీ, స్కూల్ బ్యాగ్, నోటుబుక్స్, ఇంకా గుడ్లను ప్రదర్శించారు. వీటి మీద అన్నింటిపైన జగన్ ఫోటో ముద్రించబడి ఉంది. ఆఖరుకు కోడిగుడ్లపై కూడా జగన్ ఫొటో ముద్రించారని లోకేష్ ఎద్దేవా చేశార.

విద్యార్థులకు పంపిణీ చేసే స్కూల్ బ్యాగులు, నోటుబుక్స్‌పై తన చిత్రాలను ముద్రించుకోవాలనే మోజు జగన్‌కు ఎక్కువగా ఉందని లోకేష్ విమర్శించారు. ఇటువంటి ప్రచారం సాధారణ ప్రజలకు అసలు ఆమోదయోగ్యం కాదని ఆయన అన్నార.

జగన్ "బొమ్మ" మోజుపై లోకేష్ చేసిన కామెంట్ల వీడియో ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై టీడీపీ శ్రేణులు విమర్శలు గుప్పిస్తుండగా.. వైసీపీ శ్రేణుల కౌంటర్ ఇస్తున్నాయి. అసెంబ్లీలో లోకేశ్ చేసిన ఈ ప్రదర్శన వీడియో ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

ఇకనుండి ఎన్డీఏ ప్రభుత్వం ఏపీలో అసలు బొమ్మలు లేని కొత్త స్కూల్ యూనిఫామ్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో ఎలాంటి రాజకీయ గుర్తులు ఉండవు. ఇది పూర్తిగా తటస్థమైన ఆకుపచ్చ రంగులో రూపొందించబడింది. విద్యా వ్యవస్థను పూర్తిగా రాజకీయాల నుండి దూరంగా ఉంచడంలో లోకేశ్ ఎంతో దృఢంగా ఉన్నానని ఈ చర్య ద్వారా నిరూపించారు.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, జగన్ ఫోటో ఉన్న ఈ సరఫరాలను తొలగించవచ్చు. అయితే ఆయన ఒక రాష్ట్ర నాయకుడిగా ఆలోచించి, ప్రజా ధనాన్ని వృథా చేయకుండా, వాటిని పిల్లలకు పంపిణీ చేయాలని అనుకున్నారు. కూటమి ప్రభుత్వం ఈ అంశాన్ని గమనించి, విద్యా మంత్రి నారా లోకేష్ దీని పై కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. లోకేష్ సూచనలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలకు కొత్త యూనిఫార్మ్ రూపొందించబడింది. ఇది పూర్తిగా రాజకీయ ప్రభావం లేకుండా రూపొందించబడింది.ఈ కొత్త యూనిఫార్మ్‌కు రాజకీయ రంగులు లేకుండా, తటస్థ గ్రీన్ కలర్‌తో ఆకర్షణీయంగా డిజైన్ చేయబడింది. రాష్ట్రంలోని ప్రముఖ ప్రైవేట్ పాఠశాలల స్థాయిలోనే దీని రూపకల్పన చేయబడింది.

ముఖ్యంగా ఈ కొత్త యూనిఫార్మ్‌లో ఎలాంటి రాజకీయ గుర్తులు లేదా రాజకీయ నాయకుల చిత్రాలు లేవు. జగన్ పాలనలో బ్యాగులు, కిట్లు ఆయన ఫోటోతో ఉండే పరిస్థితి నుంచి ఇది పూర్తిగా భిన్నంగా ఉంది. ఆ వ్యూహం వైసీపీకి విఫలమైందని చెప్పడంలో సందేహం లేదు. అయితే టీడీపీ దీని నుండి పాఠం నేర్చుకుని, తగిన చర్యలు తీసుకుంది.

లోకేష్ ఇప్పటికే విద్యార్థులకు ఉత్తమ విద్యా విధానం , సహాయక వ్యవస్థ అందించేందుకు వాగ్దానం చేశారు. ఇప్పుడు ఆయన ఆ మాటను నిలబెట్టుకుంటున్నారు.

Full View
Tags:    

Similar News