కరోనా మహమ్మారి కారణంగా ప్రస్తుతం దేశం వ్యాప్తంగా లాక్ డౌన్ ను విధించారు. దీనితో అత్యవసరం అయితే తప్ప , బయటకి రాలేని పరిస్థితి. కేవలం నిత్యావసర సరుకులు తెచ్చుకోవడానికి మాత్రమే అనుమతి ఇస్తున్నారు. అది కూడా కుటుంబంలో ఒకరికి మాత్రమే. కరోనా లాక్ డౌన్ సమయంలో స్వచ్ఛంద సంస్థలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు పేదలకు తమకు తోచిన సహాయం చేస్తున్నారు. వస్తువులు, డబ్బులు, శానిటైజర్లు, మాస్క్ లు పంచిపెడుతున్నారు.
అయితే , అలా పేదలకి సాయం చేస్తున్న ఓ దాతని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. పేదలకి సాయం చేస్తున్న దాతని అరెస్ట్ చేయడం ఏంటని అనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలు ట్విస్ట్ ..అందరిలా ఈ దాత నేను కూడా కూరగాయలు, సరుకులు పంచిపెడితే కిక్కేముంటుంది అనుకున్న ఆ యువకుడు తలా ఓ 90ఎంఎల్ మద్యం పంచిపెట్టాడు. పాపం మద్యం లేక మందుబాబులు పిచ్చి వారిలా మారిపోతున్నారు. దీనితో తన దగ్గర ఉన్న మద్యంలో నుండి నలుగురి నాలుగు చుక్కలు పంచి పెడుతున్నాడు. దీనితోనే పోలీసులు అతడ్ని అరెస్ట్ చేసి స్టేషన్ లో పెట్టారు.
ఆ వీడియోను ఓ జర్నలిస్ట్ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా .. ఆ వీడియో బాగా వైరల్ అయింది. దీనితో మద్యం షాపులు తెరవొద్దని కేసీఆర్ పదే పదే కఠిన ఆదేశాలిచ్చిన సమయంలో ఇలా మందు పంచిపెడుతున్న యువకుడ్ని పోలీసులు పట్టుకొని ,లాక్ డౌన్ నిబంధనలు అతిక్రమించాడంటూ కేసు పెట్టి లోపలేశారు.
అయితే , అలా పేదలకి సాయం చేస్తున్న ఓ దాతని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. పేదలకి సాయం చేస్తున్న దాతని అరెస్ట్ చేయడం ఏంటని అనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలు ట్విస్ట్ ..అందరిలా ఈ దాత నేను కూడా కూరగాయలు, సరుకులు పంచిపెడితే కిక్కేముంటుంది అనుకున్న ఆ యువకుడు తలా ఓ 90ఎంఎల్ మద్యం పంచిపెట్టాడు. పాపం మద్యం లేక మందుబాబులు పిచ్చి వారిలా మారిపోతున్నారు. దీనితో తన దగ్గర ఉన్న మద్యంలో నుండి నలుగురి నాలుగు చుక్కలు పంచి పెడుతున్నాడు. దీనితోనే పోలీసులు అతడ్ని అరెస్ట్ చేసి స్టేషన్ లో పెట్టారు.
తమ ప్రాంతంలో నిలిచిపోయిన వలస కార్మికులకు మద్యం గ్లాసుల్లో పోస్తూ.. వారికేదో సేవ చేసినట్టు ఫోజులిస్తూ ఓ వీడియో తీసుకున్నాడు తెలంగాణకు చెందిన యువకుడు.