శ్రీవారి ఆలయం ముందు మూఢ నమ్మకం తో ఆత్మహత్య !

Update: 2019-12-13 08:50 GMT
కలియుగ ప్రత్యేక్ష దైవం ఆ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానం లో ఈ రోజు విషాదం నెలకొంది. వాహన మండపం వద్ద లారీ కింద పడి ఓ భక్తుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రమాదవ శాత్తు జరిగిందేమోనని పోలీసులు డ్రైవర్‌ను అదుపు లోకి తీసుకొని విచారిస్తూ.. సీసీ ఫుటేజ్‌లు పరిశీలించారు. అయితే సీసీ ఫుటేజ్‌లలో మాత్రం భక్తుడే వెనుక టైర్లు కింద పడినట్లు స్పష్టంగా కనిపించింది.  

మృతుడు చెన్నై వాసిగా గుర్తించారు. తిరుమలలో చనిపోతే వైకుంఠానికి చేరుకుంటారన్న విశ్వాసం తోనే ఈ ఘటన జరిగినట్లు అనుమానిస్తున్నారు. భక్తులు మూఢనమ్మకాలు వదిలి పెట్టాలని.. ఇలా చేయడం మంచిది కాదని TTD ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. దీనితో శ్రీవారి దర్శనాన్ని ఆపేసారు. ఆలయ శాస్త్రం ప్రకారం ..ఆలయాన్ని శుద్ధి చేసిన తరువాత మళ్లీ దర్శనాలని పునరుద్ధరిస్తామని ఆలయ అర్చకులు చెప్పారు. అలాగే   తిరుమలలో చనిపోతే వైకుంఠానికి చేరుకుంటారన్న మూఢనమ్మకం తో ఇక్కడ ఆత్మహత్య చేసుకోవడం పాపం అని , ఏదైనా అనుకోని సంఘటనలతో తిరుమలలో చనిపోతే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది తప్ప , ఇలా ఆత్మహత్య కి పాల్పడితే వైకుంఠ ప్రాప్తి లభించదు అని భక్తులకి తెలియజేసారు.
Tags:    

Similar News