అభిమానం హద్దులు దాటితే ఎంత భయానకంగా ఉంటుందో కర్ణాటకకు చెందిన 35ఏళ్ల ఇందువలు సురేశ్ ను చూస్తే అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీకి వీరాభిమాని అయిన ఇతగాడు.. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ.. పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీల మీద తనకున్న అభిమానాన్ని ప్రదర్శించి అందరిని భయపెట్టేశాడు. ఇటీవల కాలంలో అమ్మా..కొడుకుల్ని ఇరుకున పెట్టిన నేషనల్ హెరాల్డ్ కేసులో క్షేమంగా బయటపడితే తన బొటన వేలును సమర్పిస్తానని తిరుమల శ్రీవారికి మొక్కకున్నాడు.
అతను కోరుకున్నట్లే జరగటంతో.. తాజాగా తిరుమలకు వచ్చిన అతగాడు తన బొటనవేలును కోసుకొని వెయ్యి రూపాయిల నోటులో చుట్టేసి శ్రీవారి హుండీలో వేసేశాడు. అనంతరం.. ఆసుపత్రికి వెళ్లి.. కారు ఏసీ రిపేర్ చేస్తుంటే వేలు కట్ అయ్యిందని చెప్పి వైద్యం చేయించుకున్నాడు. ఈ వ్యవహారం చివరకు బయటకు వచ్చింది. కర్ణాటకలోని బెంగళూరుకు 60కిలోమీటర్ల దూరంలో ఉన్న రామనగరానికి చెందిన ఈ గ్రానైట్ వ్యాపారి అత్యుత్సాహం పలువురిని నివ్వెరపోయేలా చేసింది.
అభిమానం ఉండటం మంచిదే కానీ మరీ ఈ స్థాయిలోనా? అన్న ఆశ్చర్యం పలువురు వ్యక్తం చేస్తున్నారు. విషయాన్ని తెలుసుకున్న కర్ణాటక మంత్రి అంబరీష్.. ఈ వీరాభిమానిని తన ఇంటికి పిలిపించుకొని మాట్లాడారు. అభిమానం ఉండటం సరైనదే కానీ.. ఇలా వేలు కోసుకోవటం మంచిది కాదంటూ నచ్చచెప్పారు. తాజా ఉదంతంతో సురేశ్ ను ఇప్పుడు కాంగ్రెస్ ఏకలవ్యుడుగా చెబుతున్నారు. ఇలాంటి మాటలే అనవసర విపరీతాలకు పాల్పడేందుకు ఉసిగొల్పుతుందన్న విషయం మర్చిపోకూడదు.